![]() |
![]() |
రవితేజ కెరీర్‌లో ఇప్పటివరకు చేయని పూర్తి విభిన్నమైన సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. మొదటిసారి రవితేజ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రమోషన్‌లో భాగంగా చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రవితేజ గాయపడ్డాడట. అయితే ఆ విషయాన్ని ఎక్కడా బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడినట్టున్నారు. అందుకే ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. ఈ సినిమాలో ఒక ట్రైన్ దోపిడీ సీన్‌ను ఎంతో నేచురల్‌గా తీసే ప్రయత్నం చేశారు. ట్రైన్ పై నుంచి లోపకికి దూకే షాట్‌లో అదుపు తప్పి కిందపడిపోయారు. ఆ సమయంలో మోకాలికి గాయమైంది. వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. ఆపరేషన్ చేసి 12 కుట్లు వేశారట. ఈ సీన్‌లో 400 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఎక్కువ రోజులు షూటింగ్‌ను వాయిదా వెయ్యడం వల్ల నిర్మాతకు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన రవితేజ రెండు రోజుల్లోనే షూటింగ్‌కి రెడీ అయిపోయాడట. రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారని, కాబట్టి మీరు కోలుకున్న తర్వాతే షూటింగ్ చేద్దామని చెప్పినా రవితేజ వినలేదని, సినిమా ఆయనకు ఉన్న అంకితభావం చూస్తుంటే తనకు చాలా సంతోషం కలిగిందని అభిషేక్ వివరించారు. రవితేజ మొదటి నుంచీ నిర్మాతల హీరోనే. ఈ విషయం చాలా సినిమాలతో ప్రూవ్ అయింది. ఈ సినిమా షూటింగ్ విషయంలో నిర్మాత శ్రేయస్సు కోరుకున్న రవితేజ గొప్ప తనాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
![]() |
![]() |