![]() |
![]() |
.webp)
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది అక్రమ అరెస్ట్ అంటూ ఎందరో ప్రముఖులు తమ గళం వినిపించారు. సామాన్యులు సైతం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కానీ కుటుంబ సభ్యుడైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు చంద్రబాబు అరెస్ట్ స్పందించలేదు. దీంతో జూనియర్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ మౌనానికి కారణం సినిమాలే అంటూ తన స్నేహితుడు రాజీవ్ కనకాల తెలిపారు.
ఎన్టీఆర్, రాజీవ్ కనకాల ఎంత మంచి స్నేహితులే తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కి చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిచ్చిన రాజీవ్ "తారక్ స్పందించకపోవడానికి కారణం ఇదే అని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, ఆర్ఆర్ఆర్ తీసే టైంలో ఇంకో మూడు నాలుగు సినిమాలు తీసేవాడు. అలాగే దేవర చేయడానికి కూడా సంవత్సరం పైన పడుతుంది. అతనికి నటన అంటే చాలా ఇష్టం. రావడానికి కూడా ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికి సినిమాల మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి అనుకొని ఉంటాడు. అందుకే దేని గురించి ఎక్కువగా స్పందించడం లేదు అనుకుంటున్నాను. " అన్నారు.
![]() |
![]() |