![]() |
![]() |

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'తమ్ముడు'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అక్కాతమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లయ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాని సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
'తమ్ముడు'లో సినిమాకి కీలకమైన పవర్ ఫుల్ పాత్ర ఉందట. ఆ పాత్రను సీనియర్ హీరోతో చేయిస్తే బాగుంటుందని భావించిన మూవీ టీమ్.. రాజశేఖర్ ని సంప్రదించిందట. రాజశేఖర్ సైతం ఆ పాత్ర చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. యాంగ్రీ మ్యాన్ గా రాజశేఖర్ కి ఎంతో ఇమేజ్ ఉంది. అప్పట్లో ఆయన ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలు తగ్గిపోయాయి. 'గరుడ వేగ', 'కల్కి' తర్వాత ఆయన నుంచి సరైన సినిమాలు రాలేదు. ఈ క్రమంలో ఆయన స్పెషల్ రోల్ చేయడానికి అంగీకరించారనే వార్త ఆసక్తికరంగా మారింది. ఈ వార్త నిజమైతే ఆయనకు విలన్ రోల్స్, స్పెషల్ రోల్స్ క్యూ కడతాయి అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |