![]() |
![]() |

ఇటీవల తమిళ హీరో విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా(16) ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి విజయ్ కుటుంబం బయటకు రాలేకపోతుంది. ఆ సమయంలో తన కూతురితో పాటే తానూ చనిపోయానంటూ విజయ్ అన్న మాటలు అందరి చేత కంటతడి పెట్టించాయి. తాజాగా విజయ్ సతీమణి ఫాతిమా కూడా కూతురుని తలచుకుంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
"నువ్వు 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని నాకు తెలిస్తే.. కనీసం సూర్యచంద్రులకు కూడా చూపించకుండా.. నిన్ను నాకు చాలా దగ్గరగా ఉంచుకునేదాన్ని. నీ ఆలోచనలతో నేను రోజూ చచ్చిపోతున్నాను. నువ్వు లేకుండా ఉండలేక పోతున్నాను. ఈ అమ్మనాన్న దగ్గరకు తిరిగి వచ్చేయ్. చెల్లి నీకోసం ఎదురుచూస్తూ ఉంది. లవ్ యూ" అంటూ విజయ్ భార్య ఫాతిమా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఫాతిమాకు ధైర్యం చెప్తున్నారు.

![]() |
![]() |