![]() |
![]() |

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి(86) కాసేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లి. ఆయనకు దిల్ రాజుతో పాటు మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్యామ్ సుందర్ రెడ్డి మృతితో పలువురు సినీ ప్రముఖులు దిల్ రాజుకి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.
![]() |
![]() |