Home

»

Latest News

ప్రపంచానికి కావలసింది నీలాంటి మగాడే : అనసూయ

Oct 4, 2023 5:49PM

బుల్లితెరపై, వెండితెరపై రాణిస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న అనసూయ ఇప్పుడు సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, కొన్ని విషయాలపై స్పందించే అనసూయకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. అందుకే తనకు సంబంధించిన ఏ విషయాన్నయినా అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. అంతేకాదు, తన వివాదాస్పద వ్యాఖ్యలతో కొన్నిసార్లు ఇరుకున పడిన సందర్భాలు కూడా లేకపోలేదు. 

లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో ఓ కొత్త పోస్ట్‌తో అభిమానుల్ని పలకరించింది అనసూయ. తన భర్త పుట్టినరోజు సందర్భంగా అనసూయ ఓ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ వేసింది. అదేమిటంటే.. ‘నీలాంటి భర్త, నీలాంటి తండ్రి, నీలాంటి కొడుకు, నీలాంటి అల్లుడు, నీలాంటి అన్న... మొత్తానికి నీలాంటి మగాడు ఈ ప్రపంచానికి కావాలి’ అంటూ  అనసూయ వేసిన ట్వీట్‌తో తన భర్తపై ఆమెకు ఎంత ప్రేమ వుందో వ్యక్తమవుతోందని నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడీ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com