Home  »  News  »  అఖిల్ 100 కోట్ల మూవీ.. ఫాన్స్ ఖుషి 

Updated : Sep 29, 2023


తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోగా చెలామణి అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న నటుడు అఖిల్ అక్కినేని.మంచి అందం,హైట్, కష్టపడేతత్వం అలాగే తెలుగులో స్పష్టంగా డైలాగ్ లు చెప్పగలిగే సామర్ధ్యం లాంటి అన్ని అర్హతలు ఉన్నా కూడా అఖిల్ కి ఎందుకనో ఇంతవరకు సరైన సక్సస్ రాలేదు. తాను  ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఫలితం చూపించలేదు.లేటెస్ట్ గా విడుదలైన ఏజెంట్ మూవీ కూడా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు అఖిల్ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
 
అక్కినేని వంశ నట వారసుడు అఖిల్ అక్కినేని తాను ఇంతవరకు చేసిన అన్ని సినిమాల్లో కూడా అద్భుతంగా నటించి ప్రేక్షులందరి దృష్టిలో మంచి నటుడు అనే పేరుని సంపాదించాడు .అలాగే  తాత నాగేశ్వరరావు తండ్రి నాగార్జునలకి తగ్గ వారసుడు అని అందరు అనుకునేలా చేసాడు. కానీ సినిమా కథ విషయం లో ని లోపాలవల్ల అలాగే ఇతరత్రా కారణాల వల్ల అఖిల్ నటించిన సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి .ఈ మధ్యనే వచ్చిన ఏజెంట్ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడినా గాని బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ప్లాప్ అయింది .ఆ సినిమా వచ్చి సుమారు ఐదు నెలలు అవుతున్నా కూడా ఇప్పటివరకు  అఖిల్ తదుపరి సినిమా గురించి ఎలాంటి వార్తలు రాలేదు .దాంతో అక్కినేని అభిమానులు కొంత నిరాశ పడ్డారు.కానీ ఇప్పుడు అఖిల్ చేయబోయే కొత్త చిత్రం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అఖిల్ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది. అఖిల్ తన నెక్స్ట్ మూవీ ని  యు .వి క్రియేషన్స్ లో  చేయబోతున్నాడని ఈ సినిమా ద్వారా అనిల్ అనే ఒక కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడని  సినీ వర్గాల్లో కూడా చాల బలంగా వినపడుతుంది. అలాగే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో ను, తమిళ మాస్ దర్శకుడు లింగు స్వామితోను అఖిల్ సినిమాలు  చేయబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి .కానీ ఆ రెండు సినిమాలు ఉండవని యు .వి క్రియేషన్స్ లోని  సినిమా మాత్రమే ఉంటుందని అంటున్నారు.పీరియాడిక్ నేపథ్యంలో జరిగే ఆ సినిమా సుమారు 100 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ వార్తతో ఇప్పుడు అక్కినేని ఫాన్స్ ఫుల్ ఖుషి తో ఉన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.