![]() |
![]() |

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి 2023 క్యాలెండర్ ఇయర్ భలేగా కలిసొచ్చింది. ఆరంభంలో పఠాన్ తో సంచలన విజయాన్ని అందుకున్న షారుక్.. తాజాగా రిలీజైన జవాన్ తోనూ బ్లాక్ బస్టర్ హిట్ ని క్రెడిట్ చేసుకున్నాడు. దీంతో.. కింగ్ ఖాన్ అభిమానులు సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే, జవాన్ విజయాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్న షారుక్.. కొత్త సినిమా విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్ లో డుంకీ పేరుతో షారుక్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 23కి షెడ్యూల్ చేశారు. అయితే, జవాన్ ఫలితంతో పూర్తి సంతృప్తిగా ఉన్న షారుక్.. డుంకీని రిలాక్స్డ్ గా కంప్లీట్ చేసి మంచి ప్రమోషన్స్ తో జనాల్లోకి తీసుకెళ్ళాలని భావిస్తున్నాడట.
అందుకే.. 2024 సమ్మర్ స్పెషల్ గా డుంకీని విడుదల చేయాలని షారుక్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. త్వరలోనే డుంకీ వాయిదాపై క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా, డుంకీ వాయిదా పడితే ఆ తేదికే ప్రభాస్ సలార్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో ప్రశాంత్ నీల్ ఉన్నాడని టాక్. మరి.. డుంకీ మిస్ అవుతున్న డేట్ కే సలార్ వస్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |