![]() |
![]() |

విజయ్ దేవరకొండ, సమంతల 'ఖుషి' చిత్రం ఫలితమెలా ఉన్నా.. పాటల పరంగా మాత్రం భలేగా మెప్పించింది. ఈ సినిమాతో మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే, హేషమ్ ఈ ఏడాది మరో రెండు తెలుగు సినిమాలతో పలకరించబోతున్నాడు. అందులో ఒకటి 'స్పార్క్' కాగా, మరొకటి 'హాయ్ నాన్న'. విక్రాంత్, మెహ్రీన్, రుక్సార్ నటించిన స్పార్క్ నవంబర్ 17న రిలీజ్ కానుండగా.. నాని, మృణాళ్ ఠాకూర్ నటిస్తున్న హాయ్ నాన్న డిసెంబర్ 21న విడుదల కానుంది.
కాగా, ఈ రోజు (బుధవారం) స్పార్క్ నుంచి హేషమ్ మార్క్ మెలోడీ ఒకటి వచ్చింది. "ఏమా అందం ఏమా అందం.." అంటూ సాగే ఈ పాటకి సిద్ శ్రీరామ్ గాత్రమందించగా.. అనంత్ శ్రీరామ్ సాహిత్యమందించారు. వినగా వినగా ఆకట్టుకునేలా ఈ బ్యూటిఫుల్ మెలోడీ ఉంది. మరి.. హేషమ్ సంగీతం స్పార్క్ మూవీకి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |