.WEBP)
ఇటీవల ప్రకటించిన 69వ నేషనల్ అవార్డుల్లో తెలుగు సినిమాలకు సంబంధించి వివిధ శాఖల్లో అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. అందులో బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి ఎంపికయ్యారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘కొమురం భీముడో..’ పాట పాడిన కాలభైరవ బెస్ట్ సింగర్‌గా ఎంపికయ్యారు.
69వ నేషనల్ అవార్డు సెలెక్షన్ కమిటీలో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.శ్రీలేఖ తెలుగు, కన్నడ భాషలకు సంబంధించి జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించారు. సెప్టెంబర్ 8 శ్రీలేఖ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమెతో ‘తెలుగువన్’ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడిరచారు. అందులో నేషనల్ అవార్డుల ప్రస్తావన వచ్చినపుడు... ‘నేషనల్ అవార్డు సెలెక్షన్ కమిటీలో జ్యూరీ మెంబర్‌గా నేను ఉండడం చాలా సంతోషం కలిగింది. అంతేకాదు నేను ఉన్న సమయంలోనే టాలీవుడ్‌కి ఇన్ని అవార్డులు రావడం కూడా ఎంతో హ్యాపీగా అనిపించింది. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌గారు ఎంపికవడం మనందరం గర్వించదగిన విషయమే. కానీ, తెలుగులో ఈ అవార్డు ఎప్పుడో రావాలి. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌కి 6 అవార్డులు, అన్నయ్య కీరవాణికి బెస్ట్ మ్యూజిక్‌లో అవార్డు, భైరవకి బెస్ట్ సింగర్ అవార్డులు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు రాఘవేంద్రరావుగారు, వాళ్ళ అబ్బాయి ప్రకాష్ ఒకే స్టేజ్‌పైన అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కీరవాణి అన్నయ్య, భైరవ దాన్ని రిపీట్ చెయ్యడం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది’ అన్నారు.