![]() |
![]() |

ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన ఒక సినిమా తీసేటప్పుడు తన పూర్తి దృష్టి దానిమీదే పెడతారు. అందుకే ఆయన ఒక్కో సినిమా తీయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ ఆయన సినిమాలు సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టడానికి మిగతా వారికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. కాగా రాజమౌళి ఒకేసారి రెండు సినిమాలు తీయడం అసాధ్యమని చెప్పొచ్చు. కానీ ఇతరుల తీసిన సినిమాలను మాత్రం ఆయన థియేటర్ వెళ్ళి మరీ వరుసగా చూస్తారు. తాజాగా ఆయన రెండు సినిమాలను అలాగే వరుసగా చూశారు.
నిన్న(సెప్టెంబర్ 7) 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి', 'జవాన్' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ చూశానంటూ ట్విట్టర్ వేదికగా స్పందించిన రాజమౌళి.. రెండు మూవీ టీమ్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

"స్వీటీ(అనుష్క శెట్టి) ఎప్పటిలాగే అందంగా మెరిసిపోయింది. నవీన్ పోలిశెట్టి ఎంతగానో నవ్వించాడు. ఇంత సున్నితమైన విషయాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేసిన దర్శకుడు మహేష్ కి హ్యాట్సాఫ్" అంటూ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' టీంకి శుభాకాంక్షలు తెలిపారు రాజమౌళి.

"అందుకే షారూఖ్ ఖాన్ ని బాక్సాఫీస్ బాద్షా అంటారు. విజయ పరంపరను హిందీలో కూడా కొనసాగించిన అట్లీకి కంగ్రాట్స్" అంటూ జవాన్ టీంని విషెస్ తెలిపారు దర్శక ధీరుడు.
![]() |
![]() |