![]() |
![]() |
హీరో విశ్వక్‌సేన్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆహా సంస్థలో ఫ్యామిలీ ధమాకా పేరుతో ఓ షో రాబోతోంది. దీనికి విశ్వక్‌సేన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోతో అందర్నీ అలరించేందుకు ఫ్యామిలీతో ఆట ఆడిరచబోతున్నారు. సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటలకు ఈ షో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ షో కుటుంబానికి ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందట. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 7నే అందుబాటులోకి రానుంది. ఈ షోకి సంబంధించిన ప్రీ లాంచ్ ఈవెంట్ ఇటీవల కాకినాడలోని ఎస్‌ఆర్‌ఎంటి ఐనాక్స్‌లో జరిగింది. కాకినాడలోని ఫ్యామిలీస్‌తో ఆటలు ఆడిరచి ఆనందపరిచారు. ఈ షో థీమ్ సాంగ్‌కి అందరూ డాన్స్ చేసి సందడి చేశారు. విశ్వక్‌సేన్ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ఫ్యామిలీ ధమాకా షో ఎంత వరకు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి.
![]() |
![]() |