![]() |
![]() |

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ 52వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్, లుక్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం ఒజి, ఉస్తాద్, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్న పవర్‌స్టార్... సురేందర్‌రెడ్డితో మరో ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన విషయం తెలిసిందే. కొన్ని నిమిషాల క్రితం విడుదలైన ‘ఒజి’ గ్లింప్స్ వ్యూస్‌పరంగా, లైక్స్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఎ.ఎం.రత్నం నిర్మాణలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకి సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. గడ్డంతో, డిఫరెంట్ లుక్‌తో ఉన్న ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. దీంతో అభిమానుల ఆనందం హద్దులు దాటింది. తమ అభిమాన హీరోకి సంబంధించి ఒక వీడియో, ఒక లుక్‌ని బాగా ఎంజాయ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.
![]() |
![]() |