
ఇప్పుడు దేశవ్యాప్తంగా రీరిలీజ్‌ల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు థియేటర్లలో హల్ చల్ చేసి రికార్డులు సృష్టించిన సినిమాలను మళ్ళీ థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలా ఈమధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడా కోవలోకి మరో బ్లాక్‌బస్టర్ ‘ఖల్ నాయక్’ రాబోతోంది. ఆగస్ట్ 6కి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న రీరిలీజ్‌కి సిద్ధమైంది. అంతేకాదు, సెప్టెంబర్ 4న ఈ సినిమా ప్రీమియర్‌ను ముంబైలో ప్లాన్ చేశారు. ఈ ప్రీమియర్‌కు బాలీవుడ్ ప్రముఖులు ఎందరో హాజరై సందడి చేయబోతున్నారు.
సంజయ్‌దత్ టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. సుభాష్ ఘాయ్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలోని ‘ఛోళీ కే పీఛే క్యా హై..’ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎక్కడా చూసినా ఈ పాటే వినిపించేది. ఈ పాటలో మాధురీ దీక్షిత్ పెర్‌ఫార్మెన్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా మాధురీ దీక్షిత్, సంజయ్‌దత్ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించేందుకు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.