![]() |
![]() |
.webp)
'స్కంద' నుంచి ఇప్పటివరకు "నీ చుట్టు చుట్టూ", "గండరబాయి" అంటూ సాగే పాటలు యూట్యూబ్ ముంగిట సందడి చేశాయి. ఈ రెండు గీతాలు కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. కట్ చేస్తే.. బుధవారం (ఆగస్టు 30) థర్డ్ సింగిల్ ని రిలీజ్ చేసింది యూనిట్.
"డుమ్మారే డుమ్మా డుమ్మారే" అంటూ మొదలయ్యే ఈ పాటలో హీరోహీరోయిన్లు రామ్ పోతినేని, సయీ మంజ్రేకర్ తో పాటు ముఖ్య పాత్రధారులైన శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి కూడా కనిపించారు. పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ గీతం వీనులవిందుగానూ, కనువిందుగానూ ఉందనే చెప్పొచ్చు. యువ సంగీత సంచలనం తమన్ బాణీకి కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యమందించగా.. అర్మాన్ మాలిక్, అయ్యన్ ప్రణతి గాత్రమందించారు. మరి.. పాటలతో ఇంప్రెస్ చేస్తున్న 'స్కంద'.. సినిమాగానూ మురిపిస్తుందేమో చూడాలి.
కాగా, 'స్కంద'లో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటించగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ఈ సినిమా జనం ముందుకు రానుంది.
![]() |
![]() |