![]() |
![]() |

మొన్నటికి మొన్న 'స్కంద' ట్రైలర్ ఈవెంట్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ తన స్పీచ్ తో ఫ్యాన్స్ ని ఖుషీ చేసారు. నిన్నటికి నిన్న 'భగవంత్ కేసరి' సెట్ లో మోక్షజ్ఞ సందడి చేసిన పిక్స్ కాస్త వైరల్ అయిపోయి.. వారి ఆనందాన్ని రెట్టింపు చేశాయి.
ఇలా మంచి హ్యాపీ మూడ్ లో ఉన్న బాలయ్య అభిమానులను.. ఈ రోజు ఓ బ్యాడ్ న్యూస్ ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. బాలకృష్ణ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటైన 'భైరవద్వీపం'ని '4K' లో రిరిలీజ్ కి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఆగస్టు 5న రిరిలీజ్ డేట్ గా అనుకున్నారు. ఆ తరువాత అది ఆగస్టు 30కి మారింది. బాలయ్య మొదటి సినిమా 'తాతమ్మ కల' 49 ఏళ్ళ క్రితం ఇదే తేదిన విడుదల కావడంతో.. 'భైరవ ద్వీపం' రిరిలీజ్ ఫ్యాన్స్ కి మరింత స్పెషల్ అయింది. తీరా చూస్తే.. ఈ రోజు బ్యాడ్ న్యూస్ వినిపించారు. చివరి నిమిషంలో 4కె వెర్షన్ కి సంబంధించిన ఇష్యూస్ రావడంతో.. రిలీజ్ ని ఆపేశారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. నవంబర్ లో భైరవ ద్వీపం రిరిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా. భైరవద్వీపంని బిగ్ స్క్రీన్ పై మళ్ళీ చూడాలనుకున్న ఫ్యాన్స్ కి ఇది చేదు వార్తే.
ఇదిలా ఉంటే, బాలకృష్ణ కొత్త చిత్రం 'భగవంత్ కేసరి' దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించనున్నారు బాలయ్య.
![]() |
![]() |