![]() |
![]() |

ఈ ఏడాది ఆగస్టు నెల తెలుగు సినిమాకి అంతగా కలిసి రాలేదు. ఈ నెలలో వచ్చిన స్ట్రయిట్ పిక్చర్స్ అన్నీ బాక్సాఫీస్ ముంగిట బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ నెలపైనే పరిశ్రమ ఫోకస్ ఉంది. విశేషమేమిటంటే.. ఈ నెలలో తెలుగు తారల నుంచి మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అయితే, ఈ మూడు చిత్రాలు కూడా ఆయా స్టార్స్ కి ఎంతో కీలకం. ఆ వివరాల్లోకి వెళితే..
విజయ్ దేవరకొండ: గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండకి సాలిడ్ హిట్ లేదు. టాక్సీవాలా ఓకే అనిపించగా డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఒకదాన్ని మించి మరొకటి నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ 1న రానున్న ఖుషిపైనే తను ఆశలు పెట్టుకున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రొమాంటిక్ డ్రామా రిలీజ్ కానుంది.
రామ్ పోతినేని: ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేసిన రామ్ పోతినేని.. ఆపై రెడ్, ది వారియర్ సినిమాలతో భంగపడ్డాడు. ఈ నేపథ్యంలోనే.. సెప్టెంబర్ 15న రానున్న స్కందపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ యాక్షన్ డ్రామా.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ప్రభాస్: బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి.. ఆపై వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్ అందించాయి. ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ 28న విడుదల కానున్న సలార్ ఫలితం ఎంతో కీలకంగా మారింది. ఈ సినిమా కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
మరి.. విజయ్, రామ్, ప్రభాస్ లో ఎవరెవరు పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొడతారో చూడాలి.
![]() |
![]() |