![]() |
![]() |
తమిళ్ హీరో అజిత్ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. అతనికి నటనతోపాటు ఇతర రంగాలపైనా ఎంతో ఆసక్తి ఉంది. ప్రస్తుతం అజిత్ బైక్ రైడిరగ్‌లో ప్రపంచ యాత్ర చేస్తున్నారు. గతంలో గన్ షూటింగ్‌లో కూడా విజేతగా నిలిచారు. చెన్నైలోని ఎంఐటి విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆయన సలహాదారుడిగా ఉన్నారు. అజిత్ నేతృత్వంలో ఏరోనాటికల్ విద్యార్థులు డ్రోన్‌లను తయారు చేస్తున్నారు. ‘దక్ష’ పేరుతో పిలవబడే ఈ విద్యార్థుల బృందం తయారు చేసిన డ్రోన్‌లు కరోనా టైమ్‌లో ఎంతో ఉపయోగపడ్డాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో ఎంతో సహాయపడ్డాయి. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ డ్రోన్‌ల పోటీలో అవార్డులను దక్ష టీమ్ గెలుచుకుంది.
తాజాగా దక్ష టీమ్ మరో మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టనుంది. ఇండియన్ ఆర్మీ కోసం ఈ టీమ్ డ్రోన్లను తయారు చేయబోతోంది. రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకే ఆ బాధ్యతను అజిత్ టీమ్‌కు అప్పగించింది. 200 డ్రోన్లు తయారు చేసేందుకు దక్ష టీమ్‌తో ఇండియన్ ఆర్మీ ఒప్పందం కుదుర్చుకుంది. వీటి విలువ రూ.165 కోట్లు.
ప్రస్తుతం బైక్ రైడిరగ్‌లో ప్రపంచ యాత్ర చేస్తున్న అజిత్ అది ముగించుకున్న తర్వాత తన తదుపరి సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. విదాముయర్చి పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్.
![]() |
![]() |