![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి యంగ్ హీరోలు ప్రయత్నిస్తుంటారు. గత 10-15 ఏళ్లలో ఎన్నో సినిమాల్లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు చూశాం. ఇక ఇప్పుడు ఆయన సినిమా టైటిల్స్ ని రిపీట్ చేసే ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది మాత్రం మెగా హీరోనే కావడం విశేషం.
పవన్ కి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో 'తొలిప్రేమ' ఒకటి. 1998 లో విడుదలైన ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. సరిగ్గా 20 ఏళ్ళ తర్వాత అదే టైటిల్ తో వరుణ్ తేజ్ సినిమా చేసి హిట్ కొట్టాడు. అదే ట్రెండ్ ని విజయ్ దేవరకొండ, నితిన్ ఫాలో అవుతున్నారు. పవన్ కెరీర్ లో 'ఖుషి' చిత్రం ఎంత ప్రత్యేకమైనదో తెలిసిందే. అదే టైటిల్ తో శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేశాడు విజయ్. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పవర్ స్టార్ కి వీరాభిమాని అయిన నితిన్ తన కొత్త చిత్రానికి పవన్ సూపర్ హిట్ ఫిల్మ్ 'తమ్ముడు' టైటిల్ ని పెట్టుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా ప్రారంభమైంది. మరి పవన్ సినిమా టైటిల్ వరుణ్ తేజ్ కి కలిసొచ్చినట్లుగా విజయ్, నితిన్ కి కూడా కలిసొస్తుందేమో చూడాలి.
![]() |
![]() |