![]() |
![]() |
‘అసలు కంటే కొసరు ముద్దు’ అని మన పెద్దలు ఊరికే అనలేదు. అది అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. సినిమా రంగంలో ఇలాంటివి ఎంతో సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు ఈ సామెతను తరచూ నిజం చేస్తుంటారు. వారు ఒక సినిమా చేస్తే ఇచ్చే పారితోషికంతో పోలిస్తే కొన్ని సందర్భాల్లో గంటల్లోనే ఎక్కువ పారితోషికం తీసుకుంటూ ఉంటారు. అలాంటిదే ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే విషయంలో జరిగింది.
కొన్ని సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన ఆమెకు ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. అయినా తన పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదని పూజా ప్రూవ్ చేసింది. ఆగస్టు 25 శ్రావణ శుక్రవారం కావడంతో ఆరోజు కడపలోని ఓ షాపు ఓపెనింగ్‌కి పూజాను ఇన్‌వైట్ చేశారు. దానికోసం కొన్ని గంటలు కేటాయించిన పూజా తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాల 40 లక్షల రూపాయలు. ఈ ఓపెనింగ్‌లో ఆడి పాడి అక్కడికి వచ్చిన అభిమానులను అలరించింది పూజా.
![]() |
![]() |