![]() |
![]() |

కేంద్ర ప్రభుత్వం నిన్న (ఆగస్టు 24) 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించిన విషయం విదితమే. ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో మన తెలుగు సినిమా.. ఏకంగా తొమ్మిది అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ యాక్షన్ డైరెక్టన్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ కొరియోగ్రఫీ.. ఇలా తొమ్మిది విభాగాల్లో పురస్కారాలు దక్కాయి.
వీటితో పాటు మరో కేటగిరిలోనూ మనకి అవార్డ్ వచ్చింది. అదే.. బెస్ట్ తెలుగు ఫిల్మ్ క్రిటిక్. ఈ విభాగంలో పురుషోత్తమాచార్యులు ఎంపికయ్యారు. సినిమా పాటల్లోని శాస్త్రీయ సంగీతంపై పరిశోధనలు చేయడమే కాకుండా 'మిసిమి' అనే మాస పత్రికలో వ్యాసాలు రాస్తుంటారు పురుషోత్తమాచార్యులు. ఈయన తెలంగాణలోని నల్గొండ ప్రాంతానికి చెందినవారని సమాచారం. కాగా, 2021లో పురుషోత్తమాచార్యులు రాసిన వ్యాసాలకుగానూ కేంద్రం ఈ అవార్డుకి ఎంపిక చేసింది.
![]() |
![]() |