![]() |
![]() |
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి టాప్ హీరోలతో ఎస్.ఎస్.రాజమౌళి ఒకటికి మించిన సినిమాలు చేశాడు. ఇక మిగిలింది మహేష్. రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో SSMB29 రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి అప్పుడప్పుడు అప్‌డేట్స్ ఇచ్చే విజయేంద్రప్రసాద్ తాజాగా మరో కొత్త విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ తారలతోపాటు బాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తారని ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు. విజయేంద్రప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తారని తెలుస్తోంది. అయితే ఆ తారలకు సంబంధించిన వివరాలు త్వరలోనే రివీల్ చేస్తారని సమాచారం. ఇది ఆఫ్రికా నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వంచరస్ కథ అని, అందుకే హాలీవుడ్ తారల అవసరం ఈ సినిమాకి ఉందని చెప్తున్నారు విజయేంద్రప్రసాద్. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
![]() |
![]() |