
చిరంజీవి, బాలకృష్ణ... ఇద్దరు టాప్ హీరోలు ఒకే వేదికపై కలిస్తే అది సెన్సేషనే. అదే ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఇక అభిమానుల ఆనందానికి హద్దేముంది. ఇప్పుడు అదే జరగబోతోంది. అయితే అది సిల్వర్ స్క్రీన్‌మీద కాదు, బుల్లితెరపై. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. సీజన్ 2లోనే ఈ టాక్‌షోకి చిరంజీవిని గెస్ట్‌గా తీసుకు రావాలని ట్రై చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇటీవల ఓ సందర్భంలో చిరంజీవి ఈ టాక్ షోపై పాజిటివ్‌గా స్పందించారు.
తాజా సమాచారం మేరకు అన్‌స్టాపబుల్ టాక్ షోకి చిరంజీవి గెస్ట్‌గా రానున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ ఒకే వేదికపై సందడి చెయ్యబోతున్నారు. వీళ్ళిద్దరూ ఈ షోలో కనిపించడంలో అల్లు అరవింద్ పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌ను అన్‌స్టాపబుల్ సీజన్ 3 కోసం అనుకున్నారు. అయితే దాన్ని ఓ స్పెషల్ ఎపిసోడ్‌గా చెయ్యాలని ప్లాన్ చేస్తోంది ఆహా టీమ్. త్వరలోనే ఈ షోకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చాలా కాలంగా బాలకృష్ణ, చిరంజీవి మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉన్న విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో మీడియా ముఖంగా చిరంజీవిపై బాలకృష్ణ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆహాలో రాబోతున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ వారి మధ్య దూరాన్ని తగ్గిస్తుందని అందరూ భావిస్తున్నారు.