Home  »  News  »  ‘అయిరతొన్ను నునక్కళ్’ మూవీ రివ్యూ

Updated : Aug 19, 2023

సినిమా: అయిరతొన్ను నునక్కళ్ మూవీ రివ్యూ
నటీనటులు: విష్ణు అగస్త్య, రెమ్యా సురేష్, శామ్లా హంజా, జింజ్ షానగ, సుదీప్ కోషీ, నినిన్ కాసిమ్, సాజిన్ అలీ పులక్కల్
ఎడిటింగ్: నిశథ్‌ యుసుఫ్ సినిమాటోగ్రఫీ: జితిన్ స్టానిస్లాస్
మ్యూజిక్: నేహా నయ్యర్
నిర్మాత:  సలీమ్ అహమ్మద్‌
దర్శకత్వం: థమర్ కె. వి
ఓటిటి: సోని లివ్

ఓటిటి వేదికపై చిన్న పెద్దా తేడా లేకుండా కథ బాగుంటే చాలు సినిమాలు, వెబ్ సిరీస్ లు  వీక్షకాధరణ పొందుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు దర్శక, నిర్మాతలు కొత్తదనం ఉన్న కథలకి ప్రాముఖ్యతను ఇస్తున్నారు. మరి అలాంటి కథాంశంతో తెరకెక్కిన 'అయిరతొన్ను నునక్కల్' మూవీ కథేంటో ఒకసారి చూసేద్దాం...

కథ:

సౌదీ అరేబియాలోని ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరుగుతుంది. దాంతో అందులోని వారంతా ఎక్కడికక్కడ బయటకొచ్చేస్తుంటారు. ఇద్దరు పిల్లల్ని తీసుకొని రాజేష్(సంతోష్ కోషి) ఒక కార్ లో తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అలాగే మిగతా వారంతా తమ ఫ్రెండ్ వాళ్ళింటికి వస్తారు. అయితే అదేరోజు తన ఫ్రెండ్ మ్యారేజ్ డే కావడంతో సెలబ్రిట్ చేసుకుంటారు. అయితే అతని తన భార్యకిచ్చిన ఒక ఖరీదైన వాచ్ చూసి.. అక్కడే ఉన్న మరొక ఫ్రెండ్ ఆరా తీస్తాడు. అలా సరదగా ఒక గేమ్ స్టార్ట్ చేస్తారు. ఎవరైనా ఇప్పటి వరకు మీ భాగస్వామితో షేర్ చేసుకోని నిజాన్ని ఇప్పుడు చెప్పాలంటూ ఒక గేమ్ స్టార్ట్ చేస్తారు. అయితే ఇందులో మొదటి జంట నిజాలు చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ ఇంకా సీరియస్ అవుతుంది. ఇలా ఒక్కొక్కరుగా వారి గురించి చెప్తుంటారు. మరి ఇదెక్కడిదాకా వెళ్ళింది? భార్యాభర్తల మధ్య దాచిన నిజాలు, చెప్పిన అబద్ధాలు ఎలాంటి మలుపుని తీసుకున్నాయనేది మిగతా కథ.

విశ్లేషణ: 

బిల్డింగ్ లో అగ్నిప్రమాదం సంభవించిడంతో అందరూ కంగారుగా బయటకు రావడంతో కథ ఆసక్తిగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక్కో క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ డైరెక్ట్ గా కథలోకి తీసుకెళ్ళాడు డైరెక్టర్ థమర్. ప్రతీ ఒక్కరి లైఫ్ లో తమ భాగస్వామితో చెప్పలేని కొన్ని నిజాలు.. అందరి ముందు చెప్పినప్పుడు అవతివాళ్ళు అర్థం చేసుకుంటే ఓకే.. కానీ అలా అర్థం చేసుకోకుండా ఉంటేనా అసలు సమస్య.. ఇలాంటి ఒక సున్నితమైన అంశాన్ని తీసుకొని దాన్ని ప్రెజెంట్ చేయడంలో థమర్ విజయం సాధించాడు. ఈ కథలో చక్కని స్క్రీన్ ప్లే తో ఒక్కో క్యారెక్టర్ కి తగినంత ప్రాముఖ్యతను ఇస్తూ చివరివరకు ఒక ఫ్లోలో తీసుకెళ్ళాడు డైరెక్టర్ థమర్.

సినిమా నిడివి ఒక గంట నలభై  నాలుగు నిమిషాలు మాత్రమే. ‌ఇది ఈ సినిమాకి అదనపు బలమైంది.‌ కథ సింపుల్ గా ఉంటూనే కాంప్లికేటెడ్ గా మారుతుంది. సరదాకి స్టార్ట్ చేసిన ఒక గేమ్ కొంత మంది లైఫ్ కి ఎలా తలకిందులు చేసిందనేది చక్కగా తీర్చిదిద్దారు మేకర్స్. బోల్డ్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ కాన్సెప్ట్ ‌ఇది. మొదట్లో కథ కాస్త స్లోగా సాగినా.. ఒక్కో క్యారెక్టర్ గురించి పరిచయాల తర్వాత.. చూసే ప్రేక్షకుడికి అసలు టైమ్ తెలియదు. అలా సాగుతుంటుంది కథ. ఒక్కొక్కరి లైఫ్ గురించి దాచిన నిజాలు చెప్తున్నప్పుడు ఒక ఇంటెన్స్ క్రియేట్ అవుతుంది. వారి స్థానంలో ప్రేక్షకుడు లీనమై ఆలోచిస్తాడు. అంత సహజంగా తీసారు మేకర్స్. ఏదో మన ఇంట్లో వాళ్ళకే ఆ సమస్య వస్తే మనమేం చేస్తామనే ఆలోచనని ప్రేక్షకుడికి రేకేత్తించాడు డైరెక్టర్.

పెళ్ళికి ముందు ఉన్న గతాన్ని, పెళ్ళి తర్వాత మళ్ళీ గుర్తుచేసుకొని.. ఇద్దరు భార్యాభర్తలు విడిపోతారు. వీరిని ప్రేరణగా చేసుకొని మిగిలిన ఫ్రెండ్స్ వారెందుకు విడిపోయారంటూ ఆరాతీస్తూ.. అలా తమ లైఫ్ లో దాచిన కొన్ని నిజాలు చెప్పమని గ్రూప్ లో ఒకరు అన్నప్పుడు మిగిలిన వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడయితే ఆ సమస్య తమ దాకా వచ్చిందో అప్పుడే అసలు భయం ,‌ వణుకు మొదలవుతాయి. ఇదంతా చూస్తున్నప్పుడు  'ఆరెంజ్' మూవీలో రామ్ చరణ్ హీరోయిన్ జెనీలియాతో.. లవ్ కొంతకాలమే బాగుంటుంది. అబద్ధాలు చెప్తూ జీవితాంతం మేనేజ్ చేయలేమనే డైలాగ్స్ గుర్తొస్తాయి. అయితే ఆరెంజ్ మూవీకి దీనికి భిన్నంగా ఉన్నదేందంటే.. అక్కడ పెళ్ళికి ముందు కథ సాగుతుంది. ఇందులో పెళ్లి అయిన భార్యాభర్తల మధ్య ఈ టాపిక్ తో గేమ్ సాగుతుంది. కథ మొదటగా నెమ్మదిగా సాగినా వెళ్ళేకొద్ది వేగం పుంజుకుంటుంది. కథ గ్రిస్పింగ్ గా ఉంది. స్క్రీన్‌ప్లే తో పాటు బిజిఎమ్ అదనపు బలాన్నిచ్చాయి. 

నిశధ్ యుసుఫ్ ఎడిటింగ్ బాగుంది. మొదటి ముప్పై నిమిషాలలో చాలా వరకు కత్తెర వాడాల్సింది‌. జితిన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నేహా నయ్యర్ బిజిఎమ్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

రాజేష్ పాత్రలో సంతోష్ కోషి ఆకట్టున్నాడు. వినయ్ పాత్రలో విష్ణు అగస్త్య బాగా నటించాడు. వకీల్ పాత్రలో సుదీష్ స్కారియా, బెంజి పాత్రలో రష్మీ కె నయ్యర్ ఇలా తమ పాత్రల పరిధి మేర అందరు ఆకట్టుకున్నారు.

తెలుగు వన్ పర్ స్పెక్టివ్:

బోల్డ్ సీన్స్, అడల్డ్ కంటెంట్ లేని ఈ ఫ్యామిలీ డ్రామా ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. కాస్త ఓపికగా చూస్తే 'అయిరతొన్ను నునక్కళ్' ఫ్యామిలీకి ఒక స్ఫూర్తినిచ్చే పాఠమవుతుంది.

రేటింగ్: 2.5 / 5

✍🏻. దాసరి   మల్లేశ్






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.