![]() |
![]() |

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'బ్రో'. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట్లో ఈ సినిమాలో పవన్ ది అతిథి పాత్ర అని ప్రచారం జరిగింది. అయితే ఇందులో పవన్ ది అతిథి పాత్ర కాదని, ఆయన సినిమా అంతా కనిపిస్తారని మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. దాంతో పవన్ రెగ్యులర్ సినిమాల మాదిరిగానే, బ్రో బిజినెస్ భారీస్థాయిలో జరిగింది.
బ్రో సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ.30 కోట్లు, సీడెడ్ లో రూ.13.20 కోట్లు, ఆంధ్రాలో రూ.37.30 కోట్లు బిజినెస్ జరగగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొత్తంగా రూ.80.50 కోట్ల బిజినెస్ జరిగింది. రెస్టాఫ్ ఇండియా రూ.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ.12 కోట్లు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.97.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే దాదాపు రూ.100 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలు పోషించారు.
![]() |
![]() |