![]() |
![]() |

మిల్కీ బ్యూటీ తమన్నా ఆనందంతో మేఘాల్లో తేలిపోతుంది. అందుకు కారణం రామ్ చరణ్ సతీమణి ఉపాసన కావటమే. అసలు తమన్నాహ్యాపీనెస్‌కి, ఉపాసనకు ఉన్న లింకేంటి? అనే సందేహం రాక మానదు. అసలు విషయంలోకి వెళితే,.. తమన్నా చేతిలో ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్దదైన డైమండ్ చేరింది. దీని విలువ రూ.2 కోట్లు. 2019లో ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన తెలియజేసింది. మెసేజ్‌తో పాటు తమన్నా వేలికి డైమండ్ తొడుక్కున్న ఫొటోను ఉపాసన తన ట్విట్టర్‌లో షేర్ చేసిన పాత ఫొటో ఇప్పుడు వైరల్ అవుతుంది. సైరా నరసింహా రెడ్డి సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు. అందుకోసమే తమన్నాకు ఉపాసన రెండు కోట్ల ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చింది.
తమన్నా హీరోయిన్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసి దశాబ్దం పైగానే పూర్తవుతుంది. ఇప్పటికీ హీరోయిన్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆమె మరోసారి చిరంజీవితో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాయే భోళా శంకర్. ఆగస్ట్ 11న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో చిరంజీవి, తమన్నా జోడీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఈ సినిమాతో పాటు రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్‌లోనూ తమన్నా హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
ఇక వ్యక్తిగత జీవితంలో తమన్నా ప్రేమ పాఠాలను వల్లెవేస్తోంది. ఏంసీఏ మూవీ ఫేమ్ విజయ్ వర్మతో తమన్నా లవ్‌లో ఉంది. ఈ విషయాన్ని ఆమె ఓపెన్‌గానే చెప్పింది. వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2లో నటించారు. అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. రీసెంట్‌గానే వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. ప్రేమ విషయం చెప్పారు కానీ ఇటు విజయ్ వర్మ, అటు తమన్నా తమ పెళ్లి గురించి మాత్రం నోరు విప్పలేదు.
![]() |
![]() |