Home  »  News  »  ‘గుడ్ నైట్’ మూవీ రివ్యూ

Updated : Jul 3, 2023

మూవీ పేరు : గుడ్ నైట్
నటీనటులు: కె మణికందన్, మీటా రఘునాథ్, రమేశ్ తిలక్, రాయచల్ రబెక్కా
సినిమాటోగ్రఫీ: జయంత్ సేతు మాథవన్
ఎడిటింగ్: భరత్ విక్రమన్
సంగీతం: సీన్ రోల్డాన్
నిర్మాతలు:  యువరాజ్ గణేశన్, మగేష్ రాజ్, పాసిలియన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వినాయక్ చంద్రశేఖరన్
బ్యానర్: మిలియన్ డాలర్ స్టుడియోస్ & ఎమ్ఆర్పీ ఎంటర్టైన్మెంట్స్
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

కథ:

ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(మోహన్)  గురక సమస్యతో బాధపడుతుంటాడు. అతని గురక వల్ల ఆఫీస్ లో వాళ్ళు కూడా అతనికి మోటార్ మోహన్ అని పేరు పెట్టి, అతన్ని చూసి నవ్వుకుంటారు. అయితే మోహన్ తన ఆఫీస్ లోనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇక‌‌ ఒకరోజు తన లవ్ ని ప్రపోజ్ చేద్దామని అనుకునే టైంలో, ఆ అమ్మాయికి మోహన్ ‌గురకపెడతాడనే నిజం తెలిసిపోతుంది. దాంతో తను మోహన్ ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. అయితే మోహన్ వాళ్ళ అక్క భర్త రమేష్.. వాటర్ ప్యూరిఫైర్స్ ఫిక్స్ చేస్తుంటాడు. రమేష్  ఒక ఇంటికి రిపేర్ చేయడానికి వెళ్తుంటే.. ‌సాయంగా ఉంటాడని మోహన్ ని తీసుకెళ్ళగా.. అక్కడ పెద్ద సమస్య తీసుకొస్తాడు మోహన్. అదే ఇంట్లోనే అను అనే అమ్మాయి ఒంటరిగా రెంట్ కి ఉంటుంది. అయితే ఆ ఇంటి ఓనర్స్ బామ్మ, తాత ఇద్దరు కలిసి అనుకి అన్నీ వాళ్ళే అయి  కేరింగ్ గా చూసుకుంటారు. కొన్నిరోజులకి అను‌ అంటే మోహన్ కి ఇష్టం ఏర్పడగా,  ఆ విషయం అనుకి చెప్తాడు మోహన్. తను ఒప్పుకోగా.. వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకుంటారు. మరి పెళ్ళి తర్వాత మోహన్ గురక తగ్గిందా? అను, మోహన్ ల మధ్య గురక తెచ్చిన సమస్యేంటి? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

మనిషికి 'మతిమరుపు' అనే ఒక డిఫెక్ట్ ఉంటే అతను లవ్ చేయడానికి పనికిరాడా అంటూ మనం ఇప్పటికే.. నాని నటించిన 'భలే భలే మొగాడివోయ్' మూవీ చూసాం. అలాగే అతిశుభ్రం ఉన్న ఒకతను తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతవరకు తనని తాను మార్చుకున్నాడో శర్వానంద్ నటించిన 'మహానుభావుడు' సినిమాలో చూసాం. అచ్చం అలాంటి ఒక డిఫెక్ట్ 'గురక' ఉన్న వ్యక్తి మోహన్. ఈ కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. అతను పడుకున్నాక వచ్చే గురక సౌండ్ కి చుట్టుపక్కల ఎవరు పడుకోలేనంత విపరీతంగా ఉంటుందంటారు. అయితే మోహన్ తన గురక సమస్యకి ఎంత వెతికినా, ఎన్ని రకాలుగా ట్రై చేసిన ఫలితం ఉండదు.

మోహన్ పనిచేసే ఆఫీస్ లో వాళ్ళు తనను మోటార్ మోహన్ అంటూ వెక్కిరిస్తుంటే, తను ఏడుస్తూ.. వాళ్ళ బావ రమేష్ కి చెప్పుకునే సీన్లు హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయి. లవ్ చేసిన అమ్మాయి అందరి ముందు.‌. తన గురక వల్ల రిజెక్డ్ చేసినప్పుడు ఇంటికి వచ్చి ఏడుస్తుంటే, ఇంట్లో వాళ్ళంతా అయ్యో అని జాలి చూపిస్తారు. మరి అంతలా అందరికి ఇబ్బంది పెడుతున్నందుకు మోహన్ పడే బాధని కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖరన్.

మొదటి నుండి చివరివరకు ఈ కథ ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు. మోహన్ లైఫ్ లోకి ఎప్పుడైతే అను వస్తుందో.. అప్పటి నుండి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. అదే టైంలో అను లైఫ్ లో అన్నీ మంచి రోజులే అనుకున్న ప్రతీసారి తనకి సమస్య ఎదురవుతుందని, తనని తాను 'దురదృష్టవంతురాలిని' అని అనుకుంటుంది. ఇలా ఇద్దరు కలిసి లైఫ్ ని సాగించే విధానం.. ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎంచుకున్న పాయింట్ ని చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్. ఒక కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు వారంతా కలిసి ఎలా పరిష్కరించుకోవాలో తెలియజెప్తూనే,  చిన్న చిన్న సమస్యలని వదిలి పారిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పాడు. కథనం ఆకట్టుకుంది. ఫస్టాఫ్ మోహన్ సమస్యని చూపిస్తూ నవ్వులు పూజించాడు. సెకండాఫ్ అను, మోహన్ ల మధ్య గురక తెచ్చిన సమస్యని పరిష్కరించడానికి వాళ్ళు పడే కష్టాలని చక్కగా తీర్చిదిద్దారు. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా ఒక్క బోల్డ్ సీన్ కానీ బోల్డ్ డైలాగ్స్ కానీ ఉండవు. ఒక సింపుల్ కథని అంతే సింపుల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖరన్. 

భరత్ విక్రమన్ ఎడిటింగ్ బాగుంది. జయంత్ సేతు మాథవన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సీన్ రోల్డాన్ సంగీతం బాగుంది. ఒకట్రెండు పాటలు మనసుకి‌ హత్తుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: 

మోహన్ గా కె. మణికందన్ ఒదిగిపోయాడు. ఆ పాత్ర కోసమే తను ఉన్నాడేమో అనేంతలా ఆకట్టుకున్నాడు. కథని పూర్తిగా ఆసక్తికరంగా మల్చడంలో మోహన్ ది బెస్ట్ ఇచ్చాడు. అను పాత్రలో మీటా రఘునాథ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. మోహన్ కి బావ రమేష్ గా రమేష్ తిలక్ గా మెప్పించాడు. అను ఇంటి ఓనర్ గా బాలాజీ శక్తివెల్ ఆకట్టుకున్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళ పరిధి మేరకు బాగా నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

కుటుంబంలో ఎవరికేం సమస్య వచ్చిన ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆ సమస్య నుండి పారిపోకూడదని చెప్పిన ఈ 'గుడ్ నైట్' మూవీని హ్యాపీగా కుటుంబంతో కలిసి చూడొచ్చు.

రేటింగ్: 3.5 / 5

✍🏻. దాసరి మల్లేశ్






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.