Home  »  News  »  సుధాకర్ కి మంచి బ్రేక్ ఇచ్చే సినిమా 'నారాయణ అండ్ కో'!

Updated : Jun 28, 2023

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారాయణ అండ్ కో'. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ల పై పాపిశెట్టి బ్రదర్స్‌ తో కలిసి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి  మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం జూన్ 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకులు అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, హీరో తిరువీర్, నిర్మాత రాజ్ కందుకూరి, ఆర్పీ పట్నాయక్ అతిథులుగా పాల్గొన్నారు.
 
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "నారాయణ అండ్ కో టీం అందరికీ బెస్ట్ విషెస్. ట్రైలర్ ఎక్స్టార్డినరీ వుంది. చివరి పంచ్ చాలా బాగుంది. ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది. టైటిల్ రోల్ చేస్తున్న దేవి ప్రసాద్ గారు, ఆమనీ గారు, ఆర్తి, పూజా..టీం అందరికీ బెస్ట్ విషెస్. దర్శకుడు చిన్నాతో పాటు టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా మీద ప్యాషన్ తో తీశారు. కంటెంట్ చాలా బావుంది. సుధాకర్ నా స్నేహితుడు. తనతో నాది లాంగ్ జర్నీ. తనకి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తో మంచి టేకాఫ్ వచ్చింది. 'నారాయణ అండ్ కో' తో తనకి మంచి బ్రేక్ వస్తుందని భావిస్తున్నాను. జూన్ 30న విడుదలవుతున్న ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి" అని అన్నారు.

హీరో సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ.. "దర్శకుడు చిన్నా ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. చాలా మంచి ఫన్ ఎంటర్ టైనర్ అనిపించి మొదలుపెట్టాం. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన కాస్త ఆలస్యమైంది. ఆర్ధిక సమస్యలు వచ్చినప్పుడు నా వంతు ఉడుత సాయం చేశాను. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే నాకు కొడుకు పుట్టాడు. దురదృష్టవశాత్తు మూడు నెలల వ్యవధిలో మా నాన్న గారు చనిపోయారు. మా నాన్న ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్. కథ చెప్పినపుడు, సీన్స్ చూపించినపుడు చాలా ఆనందపడ్డారు, ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఆయన కోసం ఈ సినిమా హిట్ ఇవ్వాలి. నా జీవితంలో ప్రధాన వ్యక్తి నా భార్య హారిక. ఆమె సపోర్ట్ తోనే ఈ ప్రయాణం చేయగలుగుతున్నాను. మేము ఇద్దరం కలిసి సుఖ మీడియా బ్యానర్ పెట్టాం. మొదటి ప్రొడక్ట్ గా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. చిన్నా చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. అన్నీ తానై నడిపించాడు. నలుగురు సంగీత దర్శకులు మంచి మ్యూజిక్ ఇచ్చారు. 'నారాయణ అండ్ కో' సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ  నచ్చుతుంది. అనిల్ రావిపూడి గారు రావడంతో ఈ ఈవెంట్ కి ఒక కళ వచ్చింది. మాది ఎంటర్ టైనర్ ఫిల్మ్. అలాంటి సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిన అనిల్ గారు రావడం చాలా ఆనందంగా వుంది. ఆయనతో నాకు ఎప్పటి నుంచో పరిచయం వుంది. ఇప్పటికే కొన్ని వంద కోట్ల సినిమాలు ఇచ్చారు. ఇప్పుడు బాలయ్య గారితో తీస్తున్న 'భగవంత్ కేసరి' వెయ్యి కోట్లు దాటి దద్దరిల్లిపోవాలి. జూన్ 30న 'నారాయణ అండ్ కో' థియేటర్ లో చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలి" అని కోరారు.

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. "నాకు తెలిసిన ఒక నిర్మాత ఈ సినిమా చూసి చాలా నచ్చింది, అవుట్ రేట్ కి  కొనాలని అనుకుంటున్నానని నాతో అన్నారు. టీం చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. వాళ్ళు లాభాలు చూడాలని దర్శక నిర్మాత చిన్నా ఒక బోల్డ్ నిర్ణయం తీసుకున్నాడు. ఒక నిర్మాతకు అంతలా నచ్చిందంటే సినిమాలో ఏ రేంజ్ వినోదం వుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. మ్యూజిక్ చాలా బావుంది. సుధాకర్ కి చాలా గొప్ప భవిష్యత్ వుండాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్" అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. "సుధాకర్ మంచి నటుడు, రైటర్, డ్యాన్సర్. తనలో చాలా ప్రతిభ వుంది. ఒక బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ రోజుల్లో సినిమా హిట్ కావాలంటే కొత్తదనం ఉండాలి. 'నారాయణ అండ్ కో'లో ఆ కొత్తదనం కనిపిస్తుంది. ఈ శుక్రవారంతో సుధాకర్ ఎదురుచూస్తున్న బ్రేక్ వస్తుందనే నమ్మకం వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్" అన్నారు.

సప్తగిరి మాట్లాడుతూ.. "చిన్న సినిమాలా వచ్చి పెద్ద విజయం సాధించిన ప్రేమకథా చిత్రమ్ లాంటి సినిమాలు ఈ మద్య కాలంలో రాలేదు. అలాంటి సంచలన విజయం సాధించే సత్తా  'నారాయణ అండ్ కో' చిత్రానికి వుంది. కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ చక్కగా కుదిరారు. సుధాకర్ కి నేను అభిమానిని. తన డ్యాన్స్ , నటన అంటే నాకు ఇష్టం. దర్శకుడు చిన్నా కి మంచి ప్రతిభ వుంది. ఆమని గారితో కలసి పని చేయడం ఆనందంగా వుంది.  ఈ సినిమాతో నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఆడితే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్ లో చూసి ఆదరించాలి" అని కోరారు  

దర్శక, నిర్మాత చిన్నా మాట్లాడుతూ.. "బ్రదర్స్ కలసి సినిమా నిర్మించడం ఈ రోజుల్లో అరుదు. మా సేవింగ్స్ ఈ సినిమాలో పెట్టాం. క్యాలిటీ కంటెంట్ ఇస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. ఈ ప్రయాణంలో చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇది ఫ్యామిలీ ఫండెడ్ మూవీ. చాలా మంది సపోర్ట్ తో ఈ సినిమా ఫినిష్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. సుధాకర్ గారికి కృతజ్ఞతలు. సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది" అన్నారు  

ఆమని మాట్లాడుతూ.. "నారాయణ అండ్ కో సినిమాలో చక్కని పాత్ర చేశాను. చాలా డిఫరెంట్ రోల్. ఇందులో కామెడీ చాలా స్పెషల్. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చిన్నా గారు చాలా ప్లానింగ్ తో తీశారు. సుధాకర్ గారికి నటన అంటే ప్యాషన్. నిర్మాతగా కూడా ఎక్కడా రాజీపడకుండా తీశారు. తను చాలా పెద్ద స్టార్ అవుతారు. చాలా మంచి సినిమా ఇది. మీ అందరికీ సపోర్ట్ కావాలి" అన్నారు.

దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. "ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. దర్శకుడిగా కొన్ని కామెడీ సినిమాలు చేశాను. కానీ నటుడిగా మారిన తర్వాత ఫుల్ లెంత్ కామెడీ రోల్ రాలేదు. ఇప్పుడు మొదటిసారి 'నారాయణ అండ్ కో' లో అవుట్ అండ్ అవుట్ కామెడీ రోల్ చేస్తున్నాను. దర్శకుడు చిన్నా గారికి ఇది మొదటి సినిమా అయినా ఎక్కడ తడబడకుండా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. సుధాకర్ చాలా ప్రతిభ వున్న నటుడు. పెద్ద స్టార్ అవుతారు. టీం అందరూ చక్కగా చేశారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.