Home  »  News  »  త‌న‌కు అడుక్కోవాల్సిన అవ‌స‌రం లేదంటున్న స‌మంత‌

Updated : Mar 28, 2023

ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ సమంత గురించే మాట్లాడుతున్నారు. ఓవైపు శాకుంతలం ప్రమోషన్లలో పాల్గొంటున్న ఆమె, మరోవైపు ఈ ప్రమోషన్లలోనే నెక్స్ట్ ప్రాజెక్టులు ఖుషి, సిటాడెల్ గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా నార్త్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత పారితోషికాల గురించి చాలా విషయాలు మాట్లాడారు. పారితోషికాన్ని  పురుషులతో సమానంగా అందుకోవడానికి తను చాలా కష్టపడుతున్నట్లు తెలిపారు. అయితే తానుప్రత్యక్షంగా కష్టపడుతున్నట్టు అందరికీ చూపిస్తూ ప‌నులు చేయ‌డం లేదని, తను చేస్తున్న పనికి అవతల వాళ్ళు డ‌బ్బు తెచ్చి ఇచ్చే విధంగానే ప్రవర్తిస్తున్నానని అన్నారు. తను అడుక్కోవడానికి సిద్ధంగా లేనని చెప్పారు. తన పని తీరు తనకు మార్కెట్లో ఒక విలువని క్రియేట్ చేస్తుందని, `మీకు ఇంత ఇద్దాం అనుకుంటున్నాం` అని అవతలి వాళ్ళు చెప్పేలా అది చేస్తుందని, అలాంటి విషయాలు తనకు నమ్మకం ఎక్కువ అని చెప్పారు సమంత. 

అంతేకాదు, మామూలుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనుకునేవాళ్లు ఎక్కువ కష్టపడాలని... అమ్మాయిలు ఇంకా ఎక్కువ కష్టపడాలని అన్నారు. ఇంకా ఎక్కువలో తను చెప్పదలుచుకున్న విషయాలు చాలా ఉన్నాయని, ఎప్పటికప్పుడు కంఫర్ట్ జోన్‌ని వదిలిపెట్టి కష్టపడి తమ ప్రతిభను పెంపొందించుకోవడానికి కృషి చేయాలని చెప్పారు సమంత.  ప్రస్తుతం ఖుసి, సిటాడెల్‌లో నటిస్తున్నట్టు చెప్పారు. విజయ్ దేవరకొండని వీడి అంటారని అందరికీ తెలుసు. అలాగే వరుణ్ ధావన్ కూడా నార్త్ లో వీడి అంటారు. సౌత్ వీడితోనూ నార్త్ వీడితోనూ కలిసి ఒకేసారి నటిస్తుండడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు సమంత. తను అమితంగా ఇష్టపడే రాజ్‌, డీకే డైరెక్షన్లో మరోసారి సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. అదే విధంగా శివ నిర్వాణా లాంటి సెన్సిబిలిటీస్ ఉన్న‌ డైరెక్టర్ తో పని చేయడం పట్ల సంతోషంగా ఉన్నట్టు ప్రకటించారు సమంత.

శాకుంతలం సినిమాని తొలుత తాను ఒప్పుకోలేదని, తన బౌండరీస్ ని దాటి తాను ఈ సినిమాను ఒప్పుకున్నట్టు చెప్పారు. తన అనారోగ్యంగా ఉన్న ఎనిమిది నెలల్లో ఎంతో నేర్చుకున్నానన్నారు. ఆ సమయానికి విలువనిస్తున్నానని అన్నారు. ఆ సమయంలో నేర్చుకున్న విషయాలు తన జీవితం మీద చాలా ప్రభావం చూపించాయని చెప్పుకొచ్చారు సమంత. తను సెట్ లో ఉన్నప్పుడు `ఈ సీను జస్ట్ ఓకేగా వస్తే చాలు` అని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉండేలాగనే తాను నటిస్తానని అన్నారు. అలా చేసినప్పుడే తనకు ఆత్మసంతృప్తి కలుగుతుందని అన్నారు. ఎప్పుడు తను సెట్ లో డల్లుగా ఉండనని అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.