Home  »  News  »  హరీష్ శంకర్ చేతుల మీదుగా 'దోచేవారెవరురా' ట్రైలర్ 

Updated : Feb 26, 2023

ఐక్యూ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రణవచంద్ర, మాళవిక సతీషన్, అజయ్ గోష్, బిత్తిరి సత్తి, మాస్టర్ చక్రి, జెమిని సురేష్ నటీనటులుగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు దర్శకత్వంలో బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన కామెడీ థ్రిల్లర్ చిత్రం 'దోచేవారెవరురా'. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, బెనర్జీ అతిధి పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "చాలా మంది సినిమాను సెలెక్ట్ చేసుకున్నాం అంటారు. కానీ సినిమా మీద ప్యాషన్ ఉన్నవాడిని సినిమానే సెలెక్ట్ చేసుకుంటుంది తప్ప సినిమాను మనం సెలెక్ట్ చేసుకోము. శివ నాగేశ్వరావు గారు చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి తనకున్న సెన్సాఫ్ హ్యూమర్ మాకు కూడా లేదు. తను ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించారు. మళ్ళీ ఇప్పుడు మంచి కథతో వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

చిత్ర దర్శకుడు శివ నాగేశ్వరావు మాట్లాడుతూ.. "మా ట్రైలర్ ను విడుదల చేయడానికి వచ్చిన హరీష్ శంకర్, ఉత్తేజ్, దర్శకులు ప్రణీత్, నటుడు హర్ష వర్ధన్ లకు థాంక్స్. షూట్ లో ఊన్న రవితేజ సినిమా చంచల్ గూడ జైల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తనను కలవడానికి వెళ్లే వాన్ని, అక్కడ దర్శకుడు హరీష్ చేస్తున్న ఒక షార్ట్ బై షార్ట్ ను అబ్జర్వ్ చేసి నువ్వు ఫ్యూచర్ లో గొప్ప డైరెక్టర్ అవుతావు అన్నాను. ఇప్పుడు తనే నా సినిమాకు గెస్ట్ గా వచ్చాడు. ఈ సినిమా విషయానికి వస్తే ఈ కథ మొత్తం డబ్బుకు సంబందించిన అంశం చుట్టూ జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో ఇంటినుండి బయటికి వచ్చిన తరువాత మనల్ని రకరకాలుగా దోచుకుంటున్నారు. ఇంతకు ముందు ఎవర్ని దోచుకోవాలో సెలెక్ట్ చేసుకొని వారిని దోచుకొనే వారు. ప్రస్తుతం మనల్ని ఎవరు దోచుకోవాలో వారిని మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాము.. ఒక్క ఓటు వేసి. అయితే ఇది పొలిటికల్ సినిమా కాదు ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ తో పాటు ఫుల్ ఔట్ & ఔట్ కామెడీ థ్రిల్లర్ కూడా ఉంటుంది. ఇందులో నటించిన వారంతా చాలా బాగా నటించారు. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగ్గ సినిమాగా తెరకెక్కించడం జరిగింది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది" అన్నారు.

చిత్ర నిర్మాత బొడ్డు కోటేశ్వర రావు మాట్లాడుతూ.. "శివ నాగేశ్వరరావు గారి సినిమాలలో ఉన్న కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మంచి కాన్సెప్ట్ తో మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా 'దోచేవారెవరురా' సినిమా కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను" అన్నారు.

నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ.. "శివ నాగేశ్వరావు గారి దగ్గర నేను అక్షరాలు నేర్చుకొన్నాను. తన దగ్గర చాలా నేర్చుకొన్నాను. ఆర్జీవీ గారు శివ సినిమా తీసి ట్రెండ్ సెట్ చేసిన టైంలో శివ నాగేశ్వరావు గారు కిడ్నాపింగ్ బ్యాక్ డ్రాప్ తో కామెడీ సెంటిమెంట్ తో 'మనీ' లాంటి సినిమా తీసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. ఇప్పుడు ఈ 'దోచేవరెవరురా' సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

చిత్ర హీరో ప్రణవ్ చంద్ర మాట్లాడుతూ.. "డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న నన్ను హీరోగా పరిచయం చేసిన శివనాగేశ్వరావు గారికి ధన్యవాదములు. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగింది. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది" అన్నారు.

హీరోయిన్ మాళవిక సతీషన్ మాట్లాడుతూ.. "మా సినిమా ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు" అన్నారు

అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. "ఇందులో నేను డ్యూయల్ రోల్ లో నటించాను. ఇంటిల్లి పాధి చూసే విధంగా తెరకెక్కిన ఈ సినిమాలో అందరూ చలా బాగా నటించారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి" అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.