![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' సినిమాలను ప్రకటించాడు. తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు.
తమిళ్ మూవీ 'వినోదయ సీతం' తెలుగు రీమేక్ లో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ నటించనున్నాడని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఈరోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. బుధవారం జరిగిన మూవీ లాంచ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, సముద్రఖని, త్రివిక్రమ్, తమన్, నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల పాల్గొన్నారు.
ఈ చిత్రం కోసం పవన్ కేవలం 20 రోజుల డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |