![]() |
![]() |

తాజాగా కార్పొరేట్ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? విద్య అనేది పబ్లిక్ సెక్టార్ లో ఉండాలే గానీ ప్రైవేట్ సెక్టార్‌లో ఉండకూడదని చాటి చెప్పే చిత్రం సార్. పబ్లిక్ సెక్టార్ రంగంలోనే విద్య ఉండాలని చెబుతూ వెంకీ అట్లూరి దనుష్ తో సార్ అనే చిత్రాన్ని తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి హిట్ టాక్‌ని సొంతం చేసుకొంది. అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుని పోతుంది. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది. దాంతో సినిమాకు రోజు రోజుకి ప్రేక్షకులు ఆదరణ బాగా లభిస్తుంది. కానీ ఇది హృతిక్ రోషన్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ సూపర్ 30 సినిమా లాగా ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లల్ని మెరికల్లా తయారుచేసి వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి కార్పొరేట్ విద్యకు ఏమాత్రం తీసుకొని స్థాయిలో కోచింగ్ ఇచ్చి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే కథ కథనాలతో సూపర్ 30 సార్ రెండు చిత్రాలు రూపొందాయి.
ఇక వెంకీ అట్లూరి మూవీ తో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన మిస్టర్ మజ్ను, రంగ్ దే చిత్రాలు సరిగా ఆడలేదు. సార్ బాగా ఉందని టాక్ రావడంతో తాజాగా మెగా హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి వెంకీ అట్లూరి తన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారట. వీరిద్దరి కలయికలో తొలిప్రేమ మూవీ రూపొందిన మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి ఇద్దరు కలిసి ఓ సినిమాకు రెడీ అవుతున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్టులో విడుదల కానుంది. ఈ మూవీ తరువాతనే వెంకీ అట్లూరి తో వరుణ్ తేజ్ మూవీ ఉంటుందని ఇన్సైడ్ టాక్.
![]() |
![]() |