![]() |
![]() |

కోలీవుడ్ స్టార్స్ అందరూ తెలుగు దర్శకులతో జతకడుతున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ వారసుడు అనే చిత్రం చేశారు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీపు కెవి దర్శకత్వంలో శివ కార్తికేయన్ ప్రిన్స్ అనే మూవీని చేశారు. ఇక తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా సార్ అనే మూవీ విడుదల అయింది. ఉప్పెన చిత్రంతో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో విజయ్ సేతుపతి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. వీరందరూ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగువాడైన విశాల్ విషయానికి వస్తే ఇప్పటివరకు అధికారికంగా తెలుగులో సినిమా చేసింది లేదు. కేవలం తమిళ అనువాద చిత్రాలతో ఈయన తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తెలుగులో స్ట్రైట్ చిత్రం చేయలేదు.. దీనిపై చాలాసార్లు చర్చ జరిగింది. తాజాగా ఈయన టాలీవుడ్ లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నే ప్లాన్ చేశారట.
20023 మధ్యలో ఈ సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పై ఈ సినిమా రూపొందనుంది. ఈ బ్యానర్ లో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. కానీ అవి తమిళ్ చిత్రాలు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను విశాల్ సన్నిహితులు హైదరాబాద్‌లో ఉండి చూస్తున్నారు. కథ, దర్శకుడికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో దీన్ని తెరకెక్కించనున్నారు. విశాల్ ప్రస్తుతం డిటెక్టివ్ 2 చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఆయన స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పనులు పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మార్క్ ఆంటోని అనే మరో సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విశాల్ గత చిత్రం లాఠీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన వాటిని అందుకోవడంలో విఫలమైంది. కాగా ఆయన తెలుగు,తమిళ బాషల్లో రూపొందించే పాన్ ఇండియా చిత్రం ఏకంగా 200కోట్లతో రూపొందుతోందని సమాచారం.
![]() |
![]() |