![]() |
![]() |

బాబాయ్-అబ్బాయ్ నందమూరి బాలకృష్ణ, నందమూరి తారకరత్నకు ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. బాలకృష్ణ ఆటోగ్రాఫ్ ను ఒంటిపై టాటూగా వేయించుకున్నాడంటేనే బాబాయ్ అంటే తారకరత్నకు ఎంత ప్రేమో చెప్పొచ్చు. అలాగే బాలకృష్ణ సైతం తారకరత్న ఆసుపత్రి పాలైనప్పటి నుంచి అంతిమయాత్ర వరకు అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. ఇలా ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమున్న బాబాయ్-అబ్బాయ్ త్వరలోనే స్క్రీన్ షేర్ చేసుకొని నందమూరి అభిమానులను అలరించాలి అనుకున్నారు. కానీ ఇంతలోనే అనారోగ్యంతో తారకరత్న కన్నుమూశారు.
ఇటీవల 'వీర సింహా రెడ్డి'తో అలరించిన బాలకృష్ణ తన 108వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారకరత్న చేత ఒక మంచి పాత్ర చేయించాలని బాలకృష్ణ భావించారట. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా రివీల్ చేశారు. ఫిబ్రవరి 18న తారకరత్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం జరిగాయి. అయితే తారకరత్నకు నివాళులు అర్పించడానికి వచ్చిన అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. మన సినిమాలో తారకరత్నకు మంచి పాత్ర ఇవ్వాలని బాలకృష్ణ గారు చెప్పారని, ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని అనిల్ అన్నారు. దీంతో బాబాయ్ తో కలిసి నటించాననే ఆనందం తారకరత్నకు కలగకుండా అయిందని నందమూరి అభిమానులు మరింత ఆవేదన చెందుతున్నారు.
![]() |
![]() |