![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల 'వాల్తేరు వీరయ్య'తో ఎంతలా అలరించారో తెలిసిందే. అసలుసిసలు మెగా ఎంటర్టైన్మెంట్ అందించారు. అందులో ఆయన కామెడీ టైమింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. జంబలకడి జారుమిఠాయ అంటూ సోషల్ మీడియా మీమ్స్ ని కూడా వదలకుండా ఆయన వినోదం పంచిన తీరు అమోఘం. తన నుంచి ప్రేక్షకుల ఏం ఆశిస్తున్నారో అర్థమైందని, ఇక నుంచి తన తదుపరి చిత్రాలు కూడా ఇదే స్థాయిలో ఉంటాయని ఇప్పటికే మెగాస్టార్ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తన తదుపరి చిత్రం 'భోళా శంకర్'లో అంతకు మించిన వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. తమిళ సినిమా వేదాళంకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చాలా మార్పులు చేశారని, ముఖ్యంగా 'వాల్తేరు వీరయ్య' తరహాలో మెగా మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఉందట. ఇందులో అన్నయ్య చిరంజీవి, తమ్ముడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించనున్నారట. పవన్ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకదానికి చిరు స్టెప్స్ వేస్తారట. అంతకంటే బిగ్ సర్ ప్రైజ్ ఏంటంటే.. శ్రీముఖితో కలిసి చిరంజీవి 'ఖుషి' సీన్ ని రీక్రియేట్ చేయబోతున్నారట.
'ఖుషి'లో పవన్, భూమిక మధ్య వచ్చే 'నువ్వు నా నడుము చూశావు' అనే సీన్.. తెలుగులో ఆల్ టైం బెస్ట్ సీన్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ సీన్ ని ఎన్నో సినిమాల్లో, టీవీ షోలలో రీక్రియేట్ చేశారు. అయితే ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సీన్ ని రీక్రియేట్ చేయబోతున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. 'భోళా శంకర్'లో బుల్లితెర బ్యూటీలు రష్మి, శ్రీముఖి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీముఖితో కలిసి చిరంజీవి 'ఖుషి' మ్యాజిక్ ని రిపీట్ చేయనున్నారని ఇన్ సైడ్ టాక్.
![]() |
![]() |