![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా తన సత్తాను చాటుతున్నారు. ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల ప్లాన్ చేసుకుంటున్నారు. మార్చి 30న ఆయన నటిస్తున్న దసరా చిత్రం విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా కావడం విశేషం. ఇక హీరోగా కూడా శివ నిర్వాణతో పాటు పలువురు కొత్త దర్శకులకు నాని అవకాశం ఇస్తున్నారు. మరోవైపు నాని నిర్మాతగా అవతారం ఎత్తారు. మొదటి చిత్రంతోనే ప్రశాంత్ వర్మ అనే దర్శకునికి అవకాశం ఇచ్చారు. తన వాల్ పోస్టర్ ప్రొడక్షన్స్ నుంచి శైలేష్ కొలను దర్శకునిగా పరిచయం చేస్తూ హిట్ 1 హిట్ 2 చిత్రాలను నిర్మించారు. నాని తనను హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుల్లో ఒకరైన ఇంద్ర గంటి మోహనకృష్ణకు తన స్నేహ హస్తం చాటారు. జెంటిల్మెన్ తో తనకి బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రస్తుతంవరుస ఫ్లాప్స్ లో ఉన్న ఇంద్రగంటి మోహనకృష్ణకి అవకాశం ఇచ్చారు.
అతనితో బడ్జెట్‌లో ఒక లో బడ్జెట్ ఓటిటీ సినిమాను నిర్మించేందుకు నాని సిద్ధమయ్యారు. ఇంద్రగంటి మోహన కృష్ణ చెప్పిన లైన్ నచ్చడంతో నాని ఈ ప్రాజెక్టును ఓకే చేశారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో ఓ డిజాస్టర్ ను ఇంద్రగంటి మోహన కృష్ణ ఇచ్చారు. ప్రస్తుతం అతనికి సాలిడ్‌గా హిట్ కావాలి. అలాంటి సినిమాను చేసే అవకాశం నాని నిర్మాతగా ఇచ్చారు. ఈ సినిమాను ఓటిటి కోసం ప్లాన్ చేస్తున్నారు. అవుట్ పుట్ ను బట్టి థియేటర్లలో విడుదల చేసే అవకాశాలను పరిశీలిస్తారు. ఇక ఈ చిత్రం తర్వాత నాని హిట్3 చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో స్వయంగా నాని హీరోగా నటిస్తున్నారు. శైలేష్ కొలను వెంకటేష్ తో సైంధవ్ చిత్రం చేస్తున్నారు. దాని తర్వాత హిట్ 3 చిత్రం ఉండే అవకాశం ఉంది. మొత్తానికి నిర్మాతగా నాని నాలుగవచిత్రాన్ని ఇంద్రగంటి మోహనకృష్టతో చేస్తుండటం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
![]() |
![]() |