Home  »  News  »  ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ రివ్యూ!

Updated : Feb 20, 2023


వెబ్ సిరీస్ : ది నైట్ మేనేజర్ 
తారాగణం: అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, సస్వతా ఛటర్జీ, రేష్ లాంబా, జగదీష్ రాజ్ పురోహిత్, అరిస్టా మెహతా, రవి బెహ్ల్, శోభిత దూళిపాళ, తిలోత్తమ షోమ్ తదితరులు.
సంగీతం : సామ్ సి. ఎస్
ఎడిటింగ్: కళ్యాణ్ సాహా
సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్
కథ, దర్శకత్వం : సందీప్ మోదీ
నిర్మాణ సంస్థలు:  ది ఇంక్ ఫ్యాక్టరీ, బనిజయ్ ఏసియా.
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

సినిమాలే కాదు వెబ్ సిరీస్ లను కొందరు డైరెక్టర్స్ రిమేక్ చేస్తున్నారు. 2016 లో ఇంగ్లీష్ లో రిలీజ్ అయిన 'ది నైట్ మేనేజర్' ని మన నేటివిటికి అనుగుణంగా కొన్ని మార్పులతో రీమేక్ చేసి ఓటిటి లో రిలీజ్ చేసారు.

'జాన్ లి క్యారీ' పుస్తకం ఆధారంగా సందీప్ మోదీ రాసిన కథ 'ది నైట్ మేనేజర్'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని‌ ఈ‌ సిరీస్ లో నైట్ మేనేజర్ గా ఎవరు కనిపించారు? ఈ సిరీస్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం.

కథ: 
బంగ్లాదేశ్ లోని ఢాకాలో కథ మొదలవుతుంది. మంచుకొండల నడుమన వ్యాన్ లో పోలీసులు ఖైదీలను తీసుకెళ్తుండగా, అందులోని ఖైదీలలో ఒకడిగా ఉన్న షాన్ సేన్ గుప్తా(ఆదిత్య రాయ్ కపూర్) కత్తితో పోలీసులని పొడిచి,  వ్యాన్ దిగి పారిపోతాడు. ఆ తర్వాత కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. బంగ్లాదేశ్ లోని ఢాకాలో అల్లర్లు జరుగుతుంటాయి.‌ అప్పుడు ఒక హోటల్ కి నైట్ మేనేజర్ గా షాన్ సేన్ గుప్తా(ఆదిత్య‌రాయ్ కపూర్)  చేస్తుంటాడు. ఆ హోటల్ కి వచ్చిన ‌ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయి సఫీనా (అరిస్తా మెహతా)‌ తనని ఇండియాకి  పంపించమని అడుగుతుంది. దానికి షాన్ మొదట నిరాకరించినా, ఆ తర్వాత ఒప్పుకుంటాడు. షాన్ కాపాడాలని అనుకున్న సఫీనా గురించి తెలుసుకుంటాడు. తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఫ్రెడ్డీ రహమాన్(రేష్ లాంబా) కి భార్య అని తెలుస్తుంది. అతను వ్యాపారమే కాకుండా స్మగ్లింగ్ కూడా చేస్తుంటాడని ఒక‌ వీడియోలో చూసి షాన్ తెలుసుకుంటాడు. అదే సమయంలో స్మగ్లింగ్ చేస్తూ, బయటకు గొప్ప బిజినెస్ మ్యాన్ గా కనిపించే శైలేంద్ర రుంగ్తా(అనిల్ కపూర్) కథలోకి  వస్తాడు. అసలు శైలేంద్రకి ఈ అమ్మాయికి సంబంధం ఏంటి? నైట్ మేనేజర్ గా చేస్తున్న షాన్ జీవితంపై శైలేంద్ర రుంగ్తా  ప్రభావం ఏంటో మిగతా కథలో తెలుస్తాయి.

విశ్లేషణ:

షాన్(ఆదిత్యరాయ్ కపూర్) ఒక హోటల్ లో నైట్ మేనేజర్ గా ఉంటూ తన ఇంటలిజెన్స్ తో ఆయుధాలు స్మగ్లింగ్ చేసే శైలేంద్ర రుంగ్తా(అనిల్ కపూర్) కి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం అందరికీ నచ్చేస్తుంది. మొత్తం నాలుగు ఎపిసోడ్ లుగా ఉన్న ఈ సిరీస్‌ ఒక్కో ఎపిసోడ్  నిడివి కాస్త ఎక్కువగా ఉంది. మొదటి ఎపిసోడ్‌లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ కొంచెం స్లోగా అనిపిస్తాయి. రెండవ ఎపిసోడ్ చివరలో కథలోకి వెళ్తుంటే ఆసక్తికరంగా సాగుతుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ పోలీసులకి తెలిస్తే, వారికన్నా ముందుగా శైలేంద్ర రుంగ్తాకి తెలిసే సీన్స్ ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే మూడవ ఎపిసోడ్‌లో శైలేంద్ర రుంగ్తాకి దగ్గరగా షాన్ వెళ్ళి తనతోనే ఉంటూ వారిలో వారికే గొడవలు పెట్టించి, అతనో మంచివాడిలా నటించే సీన్స్ ఆకట్టుకుంటాయి. కాకపోతే ఆ ఎపిసోడ్ కాస్త స్లోగా సాగుతుంది. 

శైలేంద్ర రుంగ్తా ని రిచ్ బిజినెస్ మ్యాన్ గా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇలాంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ లో బిజిఎమ్ బాగుండాలి. కానీ హీరో షాన్ కి విలన్ శైలేంద్ర రుంగ్తాకి మధ్య వచ్చే సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్  పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సిరీస్ చివరలో హీరో విలన్ దగ్గరే  ఎందుకు ఉండిపోయాడు? విలన్ కి ఇండియాలో ఉన్న బిజినెస్ పార్ట్ నర్ ఎవరు? అనే కొన్ని అంశాలను డైరెక్టర్ అలానే వదిలేసాడు.

బెంజమీన్ జాస్పర్  సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ముఖ్యంగా సిమ్లాలోని మంచు వాతావరణాన్ని బాగా చూపించారు. ‌నిర్మాణ విలువలు బాగున్నాయి. సామ్ సి. ఎస్ సంగీతం పర్వాలేదనిపించింది. సందీప్ మోదీ కథని నడిపిన తీరు బాగుంది.‌ కానీ ఒక్కో ఎపిసోడ్ నిడివి కాస్త తగ్గించి, కొన్ని స్లో సీన్స్ ని తీసేస్తే ఇంకా బాగుండేది.  మేకర్స్ చివరి ఎపిసోడ్‌లో ‌సరైన ఎండింగ్ ఇవ్వకుండా మరో సిరీస్ ఉండబోతుందనే ఆసక్తిని ప్రేక్షకులకు కల్పించి ముగించారు.

నటీనటుల పనితీరు:

షాన్ గా ఆదిత్య రాయ్ కపూర్‌ ఆకట్టుకున్నాడు.  అతని స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. శైలేంద్ర రుంగ్తా పాత్రలో అనిల్ కపూర్ తన నటనతో ఈ సిరీస్ కి ప్రాణం పోసాడు. అరిస్టా మెహతా పాత్ర భావోద్వేగానికి గురిచేస్తుంది. శోభితా దూళిపాళ బెస్ట్ గ్లామర్ రోల్ ని ప్లే చేసింది. శశ్వతా చటర్జీ తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయి, ‌శైలేంద్రకి బెస్ట్ ప్రెండ్ లాగా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఫ్రెడ్డీ రహమాన్ పాత్రలో రేష్ లంబా ప్రముఖ గ్యాంగ్ స్టర్ లా ఉన్నంతలో కీ రోల్ ప్లే చేసాడు. జగదీష్ రాజ్ పురోహిత్ హోటల్ మేనేజర్ గా ఆకట్టుకున్నాడు. లిపికా సైకియా రావుగా తిలోత్తమా షోమ్ ఒక కీలక పాత్రలో నటించింది. జైవీర్ జయ్ సింగ్ గా రవి బెహ్ల్ పర్వాలేదనిపించాడు. ఇక మిగతావాళ్ళు ఉన్నంతలో ఆకట్టుకున్నారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'ది నైట్ మేనేజర్' ను ఒక్కసారి చూడొచ్చు.

రేటింగ్: 2.5 / 5

✍🏻. దాసరి మల్లేశ్






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.