Home  »  News  »  బాలయ్యతో మల్టీస్టారర్ చేయాలని ఉంది!

Updated : Feb 8, 2023

కన్నడలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన శివ రాజ్‌కుమార్‌ 125 వ చిత్రం 'శివ వేద'. ఈ చిత్రం అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్‌లో మొదటి వెంచర్‌గా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమాను కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలుగులో ఫిబ్రవరి 9 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. "వేద చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు హర్ష ఇంతకుముందు శివరాజ్ ఫ్యామిలీ తో నాలుగు సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకొన్నాడు. ఇప్పుడు వస్తున్న ఈ వేద సినిమాను కూడ చాలా బాగా తీశాడు . అలాగే శివరాజ్ కుమార్ ఫ్యామిలీతో నాకు ఎప్పటినుండో అనుబంధం ఉంది. వీరు ముగ్గురు అన్నదమ్ములు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్.. పునీత్ ఎన్నో మంచి పనులు చేశాడు. పునీత్ శారీరకంగా మన మధ్య లేకపోయినా తను చేసిన పనులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుపుతాయు. వేద సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. టెక్నిషియన్స్ అందరూ కలిసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు. కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఫిబ్రవరి 9న తెలుగులో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. "మా వేద ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మా బ్రదర్ బాలకృష్ణ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. వారు తన 100 వ సినిమా శాతకర్ణి సినిమా లో ఒక సాంగ్ చేయమని అడిగారు చాలా సంతోషం వేసి చేయడం జరిగింది. అయితే తనతో నాకు ఒక సాంగ్ కాదు ఫుల్ లెన్త్ కారెక్టర్ ఉన్న సినిమా చేయాలని ఉంది. ఆ సినిమా కొరకు వెయిట్ చేస్తున్నాను. బాలయ్య గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మంచి అనుబంధముంది. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరావు గారు, శివాజీ గణేషన్ గారు, ఎంజీఆర్ గారు ఇలా అందరూ బ్రదర్ లాగా ఉండే వాళ్ళు. సౌత్ ఇండియా సినిమా ఆలా అప్పటి నుండి చాలా ఫ్రెండ్లీ గా ఉంది. అలాగే నెక్స్ట్ టైం నుంచి నేను చేసే అన్ని సినిమాలను తెలుగులో పాటు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తాము. నా భార్య గీత నిర్మించిన ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫీల్ అవుతారు. మంచి కథతో ఫిబ్రవరి 9న వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది" అన్నారు.

గీతా పిక్చర్స్ అధినేత గీత మాట్లాడుతూ.. "మా సినిమా ఫంక్షన్ కి బాలయ్య గారు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము దుఃఖంలో ఉన్నప్పుడు బాలయ్య గారు మాకు అండగా నిలబడ్డారు. అందుకు వారికి ధన్యవాదములు. మా శివ వేద సినిమా కన్నడలో విడుదలై బిగ్ హిట్ అయింది. అక్కడ అంత హిట్ అయిందంటే దానికి దర్శకుడు హర్ష గారే కారణం. ఈ నెల 9న విడుదలవుతున్న మా సినిమాని సక్సెస్ చేయాలని తెలుగు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు. 

చిత్ర దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. "నేను శివన్న గారికి గీత మేడమ్ కి ఫస్ట్ గా థాంక్స్ చెప్పాలి. వారి 125 వ సినిమాకు గీత ప్రొడక్షన్ నుంచి ఆఫర్ రావడం చాలా సంతోషంగా ఉంది. టీం అందరూ హార్డ్ వర్క్ చేయడం వల్ల సినిమా చాలా బాగా వచ్చింది. మా శివ వేద సినిమాలో ఎమోషనల్ డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ గా కూడా ఉంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. కర్ణాటకలో మా సినిమాలు ఎమోషనల్ హిట్ అవ్వడమే కాకుండా లేడీస్ అందరు కూడా చాలా ఇష్టపడ్డారు. ఇప్పుడు ఫిబ్రవరి 9న తెలుగులో వస్తున్న ఈ సినిమాను కూడా బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

నిర్మాత యం వి ఆర్ క్రిష్ణ మాట్లాడుతూ.. "కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమాను శివరాజ్ కుమార్ సహాయంతో జీ స్టూడియో వాళ్లని సంప్రదించి తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఈనెల 9న విడుదల చేయడానికి ప్లాన్ చేసాము. ఇప్పుడు వస్తున్న మా సినిమాను తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

హీరోయిన్ గానవి మాట్లాడుతూ.. "మా ఫంక్షన్ కు బాలయ్య గారు రావడం చాలా సంతోషంగా ఉంది. మా శివ వేద సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుంది మీరందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.