![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏఎం రత్నం నిర్మాతగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఆయన కోలీవుడ్‌లో విజయ్ హీరోగా వచ్చిన తేరీ చిత్రానికి తెలుగు రీమేక్ లో నటించనున్నారు. ఈ మూవీకి తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం చిత్రంలోని సోల్ పాయింట్ ను మాత్రమే తీసుకొని మిగిలిన కథను మాత్రం మార్చి పవన్ ఇమేజ్ కి అనుగుణంగా సన్నివేశాలను రీ క్రియేట్ చేస్తున్నారట. అందుకోసమే ఈ చిత్రం కోసం సీనియర్ రచయిత దర్శకుడు కూడా ఆయన దశరథ్ రచయితగా పనిచేస్తున్నారు. రైటర్ కం డైరెక్టర్ అయిన దశరథ్ తనదైన స్టైల్ లో సినిమా మెయిన్ పాయింట్ ను బేస్ చేసుకుని తెలుగు చిత్రంలో పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా స్టోరీ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు.
తేరీ చిత్రం తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ అయ్యింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు డబ్ చేశారు. కానీ తెలుగులో విజయ్ కి మార్కెట్ లేకపోవడం వల్ల ఇక్కడ ఆ చిత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. తెలుగులో కూడా వచ్చిన డబ్బింగ్ సినిమాని మళ్లీ రీమేక్ చేయడంపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. తమిళంలో హీరో హీరోయిన్లు అయినా విజయ్ సమంతాల కూతురిగా మీనా కుమార్తె నటించింది. కాగా తెలుగు ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ పాప పాత్రను అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ పోషించనున్నట్లు సమాచారం. ఈ విషయమై బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారట. ప్రస్తుతం అల్లు అర్హ తెలుగులో శాకుంతలం చిత్రంలో నటిస్తోంది. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ లాగా తెలుగులో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.
![]() |
![]() |