![]() |
![]() |

శర్వానంద్ తో తీసిన తన మొదటి చిత్రం రన్ రాజా రన్ తో హిట్ కొట్టిన సుజీత్ ఆ తర్వాత పాన్ ఇండియా సార్ ప్రభాస్ తో సాహో సినిమా తీశాడు. ఈ సినిమా భారీ బడ్జెట్లో తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఉత్తరాదిన కలెక్షన్ ఫర్వాలేదనిపించాయి. దక్షిణాదిన ఈ చిత్రం నిరుత్సాహపరిచింది. ఇక మూడో సినిమాకి పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ కొట్టేశాడు సుజీత్. సాహో తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ఈ ఛాన్స్ చేజిక్కించుకున్నాడు. ఈ సినిమా స్టోరీ పవన్ కంటే ముందు మహేష్ బాబుకు వినిపించాడట. కానీ మహేష్ బాబు వద్దని చెప్పినట్లు సమాచారం. మరి ఆయన ఏ కారణాలతో వద్దని చెప్పాడో తెలియదు.
ఓజీ గ్యాంగ్ స్టర్ కథాంశంతో సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం కేవలం పవన్ 30 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడంటున్నారు. ఈ లోపు సుజీత్ సూపర్ స్పీడ్ తో ఆయన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకునేలా ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో వింటేజ్ పవన్ కనిపించనున్నాడు. దాంతో ఆయన అభిమానులు ఎంతో ఖుషీ గా ఉన్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం. మొదటి భాగాన్ని దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేస్తారట. ఆ తర్వాత రెండో భాగం గురించి వర్కౌట్ చేస్తారని సమాచారం. సెకండ్ పార్ట్ ని వచ్చే ఏడాది విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |