Home  »  News  »  సాయి పల్లవి ఒకే ఒక కామెంట్ తో రూమర్స్ కి చెక్ పెట్టేసింది!

Updated : Jan 11, 2023

వెండితెరపై అందాల ఆరబోతకు మాత్రమే హీరోయిన్లు పరిమితం అని, డబ్బు కోసం వారు దేనికైనా తెగిస్తారని అంటూ కొంద‌రికి సినిమా హీరోయిన్ల ప‌ట్ల స‌దాభిప్రాయం ఉండ‌దు.  అలాంటి వాళ్లే ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలరు అని అందరూ అనే మాట. అది వాస్తవమే అయినప్పటికీ ఇందులో కూడా కొందరు మినహాయింపు ఉంటారు.  నేటి తరంలో నిత్యామీనన్, సాయి పల్లవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ వంటి వారు స్కిన్ షోకు దూరంగా ఉంటున్నారు. అయినా కూడా తమ సత్తా చాటుతున్నారు.

ఇక బాలీవుడ్ లో కంగనా ర‌నౌత్  కూడా ఇదే కోవకు చెందుతుంది. దాంతో కేవలం అందాలు ఆరబోసే హీరోయిన్స్ మాత్రమే కాదు వాటికి పూర్తి వ్యతిరేకంగా నిలిచి టాలెంట్ తో మాత్రమే ఇండస్ట్రీలోకి దూసుకు రాగలమని నిరూపించిన హీరోయిన్స్ లలో వీరు ముఖ్యులు అని నిరూపితం అవుతోంది. వారిలో సాయి పల్లవి గురించి ముందుగా చెప్పుకోవాలి. ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్,  ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. అందరూ ఈమెని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈమె హీరోయిన్‌గా నటించిన ఆఖరి చిత్రం విరాటపర్వం ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమె ఏ సినిమాకు ఇప్పటివరకు ఒప్పుకోలేదు. అందులోనూ దైవచింతన‌లో మునిగిపోయి ఇటీవల పుట్టపర్తిలో తన కుటుంబంతో సహా కనిపించింది. 

దాంతో ఆమె ఆధ్యాత్మికత వైపు మరలిందని, ఇక సాయి పల్లవి సినిమాలు ఆపేస్తుందని, వృత్తిపరంగా ఆమె ఒక డాక్టర్ కాబట్టి త్వరలోనే ఒక హాస్పిటల్స్ స్థాపించబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది.  అభిమానులు కూడా వీటిని నమ్మారు. ఎందుకంటే ఆమె గురించి వారికి బాగా తెలుసు. ఇష్టం లేని పని చేయలేదని, సరైన పాత్రలు  రాకపోతే ఆమె మరో ప్రొఫెషన్ చూసుకుంటుందని వారికి తెలుసు. కానీ ఈ వార్తలపై సాయి పల్లవి  తనదైన స్పందించింది. ఆమె మాట్లాడుతూ నేను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చాలని కోరుకుంటాను. పాత్రలు కూడా అలాంటివే సెలెక్ట్ చేసుకుంటాను.

నా తల్లిదండ్రులు నన్ను వెండితెరపై చూసినప్పుడు గర్వపడేలా ఉండాలి గానీ వాళ్లు నన్ను చూసి సిగ్గుతో తలదించుకునే పాత్రలు మాత్రం నేను చేయను. విరాటపర్వం తరువాత ఎన్నో కథలు విన్నాను. కానీ వాటిలో నా నటనకి ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కినప్పుడే నేను సినిమా చేస్తాను. అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటాను.....అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. దాంతో ఈమె ఒకే ఒక క్లారిటీతో ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ కి చెక్ పెట్టేసింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.