Home  »  News  »  ఎవడ్రా మనల్ని ఆపేది అంటోన్న పవన్ ఫ్యాన్స్.... మేమేరా మిమ్మల్ని ఆపేది అంటోన్న మహేష్ ఫ్యాన్స్!

Updated : Jan 11, 2023


వైసీపీ శ్రేణులు ఇటీవల చంద్రబాబు నాయుడు సభలలో కూడా ప్రవేశించి తొక్కిసలాటకు కారణమై పలువురి మరణాలకు కారణమయ్యారు అనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  ఆల్రెడీ వైసీపీ నేతలు జనవరి ఒకటికి ముందే కొత్త ఏడాదితో తమ రాజకీయ ఎత్తుగడ, వ్యూహాలు మారుతాయని ప్రకటించారు. అవి ఇలాంటి పనులు చేయడమేనా అని రఘురామకృష్ణంరాజు ఇప్పటికే ఇన్ డైరెక్ట్ గా వైసీపీ నేతలను కడిగిపారేస్తున్నారు. ఈ తొక్కిస‌లాట‌లు, జ‌నాల మ‌ర‌ణాలు  మానవ ప్రేరేపితమే గాని యాదృచ్ఛికంమాత్రం కాదంటున్నారు రఘురామకృష్ణంరాజు. చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాడే జరిగి మరణాలు సంభవించడం అనేది కొందరు పన్నిన కుట్ర అని, అది యాదృచ్ఛికం కాదని కొందరు కావాలని పనిగెట్టుకొని ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు. గతంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్  ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వివాదాలు సృష్టించాడని దాని వలన పెద్ద ఎత్తున గొడవలు జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. అదే తరహాలో ఈసారి చిరంజీవి బాలయ్య మధ్య సినిమాల పరంగా ఉన్నా విభేదాలను తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ వైసీపీ నేతలు ఎంత దారుణాల కైనా ఒడి కట్టేందుకు వెనుకాడరని రఘురామకృష్ణం రాజు తో పాటు పలువురు ముందుగా హెచ్చరిస్తున్నారు....!
 
ఇక మ‌రోవైపు ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ కులం రంగుతో పాటు సినీ రంగును కూడా పులుముకుంటున్నాయి. మెగా ఫ్యాన్స్ మొత్తం ఈసారి జనసేనకు, దానితో పొత్తు పెట్టుకునే  తెలుగుదేశం కు మద్దతు ఇస్తారని తేలిపోయింది. ఇక బాలయ్య అభిమానులు ఎలాగూ టిడిపి నే. కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేనికి మద్దతు పలుకుతారో క్లారిటీ రావడం లేదు. మధ్యలో మహేష్ అభిమానుల వంతు వచ్చింది. వాస్తవానికి కృష్ణ కాంగ్రెస్ వాది.  మొద‌టి సారిగా ఎంపీగా గెలిచిన ఆయ‌న రెండోసారి ఎంపీగా ఓటమిపాలైన తరువాత  మరలా రాజకీయాల జోలికి పోలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాజకీయాలకు చాలా దూరం. ఆయన తనకుస్ఫూర్తిగా  గల్లా జయదేవ్ ని  పేర్కొంటారు. తన బావ అయిన గల్లా జయదేవ్, గల్లా కుటుంబం రాజకీయాలలో ఉన్నప్పటికీ మహేష్ బాబు మాత్రం రాజకీయంగా మౌనం వ‌హిస్తువ‌చ్చారు. ఇప్పటివరకు ఆయన ఏ పార్టీకి మద్దతు పలికింది లేదు.   పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ తన సినిమాలు తను చూసుకుంటారు. షూటింగులు లేకపోతే ఫ్యామిలీతో గడిపేస్తారు. ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేస్తారు.... లేదా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పటివరకు రాజకీయంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వని క్లీన్ ఇమేజ్ ఆయన సొంతం చేసుకున్నారు. అయితే రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నా మహేష్ బాబు ఫ్యాన్స్ కొందరు ఆయన్ని ఏపీ రాజకీయాల్లోకి లాగుతున్నారు. తాజాగా మహేష్ బాబు ఫోటోతో ఫ్లెక్సీ వెలిసింది. అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు ఫోటో కింద మేమేరా మిమ్మల్ని ఆపేది అని రాసి ఉన్న ఫ్లెక్సీ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది.  ఇటీవల వైసిపికి, జగన్ కు వ్యతిరేకంగా జనసేన అభిమానులు అంటే పవన్ అభిమానులు ఎవడ్రా మనల్ని ఆపేది అనే  స్లోగన్ తో ఫ్లెక్సీలు, పోస్టులు పెట్టారు. దానిమీద చిన్నపాటి యుద్ధమే జరిగింది. దానికి కౌంటర్ గానే మేమేరా మిమ్మల్ని ఆపేది అని రాసి ఉన్న ఫ్లెక్స్ ని వైసిపి అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో మహేష్ అభిమానులు వైసీపీకి మద్దతు ఇస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్.... వాళ్ళని ఆపడం కోసం అంత బ్యానర్ కట్టాలా?  గాజువాకలో తిప్పిరెడ్డి, భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ ఉన్నారు కదా...!  కాదు కూడదు అని గోల చేస్తే అసెంబ్లీ గేటు దగ్గర గేటు బాయ్ గోపాల్ ఎలానూ ఉన్నాడు మెడ పెట్టి గెంటేయడానికి... అని ఈ పోస్ట్ కి జత చేశారు.  దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇంత‌కీ మ‌హేష్ అభిమానులే ఈ ఫ్లెక్సీ పెట్టి  ఉంటే సినిమాల ప‌రంగా ఏమి సంబంధం లేని వైసీపీ అధికార ప్ర‌తినిధి య‌న‌మ‌ల నాగార్జున యాద‌వ్ దీనిని ప‌నిగ‌ట్టుకుని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేయ‌డం ఎందుకు?  దానికి ఆయ‌న గ్రంథి శ్రీ‌నివాస్ ఉన్నాడు. తిప్పిరెడ్డి ఉన్నాడు.. అసెంబ్లీ గేట్ ద‌గ్గ‌ర బోయ్ గోపాల్ ఎలానూ ఉన్నాడ‌ని త‌న సొంత అభిప్రాయాన్ని ఇలా ఈ ఫ్లెక్సీ కింద కామెంట్ చేయ‌డం ఏమిటి?  ఇది కావాల‌ని మ‌హేష్ అభిమానుల‌కు ఆపాదిస్తూ ఆయ‌న  ఈ విధంగా మహేష్ అభిమానుల‌ను రెచ్చ‌గొట్ట‌డం దేనికి? అనే ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.