![]() |
![]() |

కోలీవుడ్ అగ్ర కథానాయకుల్లో దళపతి విజయ్ ఒకరు. ఆయనకున్న మార్కెట్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్‌కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దళపతి వారసుడిగా ఆయన కుమారుడు జాసన్ సంజయ్ సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జాసన్ సినీ ఎంట్రీ గురించి తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే... జాసన్ హీరో అవడం కంటే దర్శకత్వంపైనే ఆసక్తిగా ఉన్నాడట. ఒకవేళ డైరెక్టర్ అయితే తొలి సినిమాను విజయ్ సేతుపతితో చేస్తాడట. తర్వాతే విజయ్‌తో సినిమా చేస్తాడట. ఈ విషయాన్ని చెప్పిందెవరో కాదు.. స్వయానా విజయ్ తండ్రి.. సీనియర్ డైరెక్టర్ ఎస్.ఎ. చంద్రశేఖర్.
మరిప్పుడు జాసన్ సంజయ్ దర్శకత్వం మీద ఆసక్తిగా ఉండొచ్చు. మరి అభిమానుల కోరిక మేరకు తనేమైనా రూట్ మార్చుకుంటాడా? లేక హీరోగా వద్దులే డైరెక్టర్‌గా చాలని అనుకుంటాడా? అనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే. జాసన్ విజయ్ హీరో అయినా, డైరెక్టర్ అయినా కావాలనుకుంటే ఇంకా అందుకు సమయం ఉంది. ప్రస్తుతం జాసన్ నటన సహా సినిమా రంగానికి సంబంధించిన కోర్సులను విదేశాల్లో అభ్యసిస్తున్నాడట. మరో వైపు విజయ్ ఫ్యాన్స్ జాసన్ సంజయ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
విజయ్ విషయానికి వస్తే ప్రస్తుతం తను 'వారిసు' (తెలుగులో 'వారసుడు') అనే సినిమాలో నటించారు. ఆ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 11న తమిళంలో.. జనవరి 14న తెలుగులో విడుదల కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్.
![]() |
![]() |