![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇండియన్ ఫిల్మ్ 'కాంతార' సైతం ఆస్కార్ రేసులో నిలిచింది. ఆస్కార్ కోసం రెండు విభాగాల్లో అర్హత సాధించి సత్తా చాటింది.

రిషబ్ శెట్టి హీరోగా నటించిన కన్నడ చిత్రం 'కాంతార'. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి రిషబ్ శెట్టినే దర్శకుడు. రూ.16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఎందరో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనత సాధించింది. ఆస్కార్ బరిలో నిలిచేందుకు రెండు విభాగాల్లో అర్హత సాధించినట్లు తాజాగా హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. మరి ఫైనల్ నామినేషన్స్ లో కూడా నిలిచి 'కాంతార' సంచలనం సృష్టిస్తుందేమో చూద్దాం.
![]() |
![]() |