Home  »  News  »  ఇంత‌కీ ఛంఘీజ్ ఖాన్  ఎవ‌రు? ఈ చిత్రాన్ని ఎవ‌రు హ్యాండిల్ చేయ‌నున్నారు?

Updated : Jan 9, 2023

తెలుగు లో టాప్ హీరోలలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ల పేర్లు చెప్పుకోవాలి. వారిద్దరూ తెలుగునాట దాదాపు సరిసమానమైన ఫాలోయింగ్ ను కలిగిన స్టార్లు. వీరిద్ద‌రికి బ‌ల‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందునా ఇద్ద‌రు మాస్ ఆడియ‌న్స్‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఉన్న వారు. మాస్‌లో వారికి ఉన్న ఫాలోయింగ్ నేటి యంగ్ స్టార్స్‌కి ఎవ్వ‌రికీ లేదంటే అతిశ‌యోక్తి కాదు. చాలా ఏళ్ల కింద‌టే వీరు త‌మ డ్రీమ్ ప్రాజెక్ట్‌ల‌ను అనౌన్స్ చేశారు. చిరు త‌న‌కు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డిని డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్ర‌క‌టించగా, బాల‌య్య చెంఘీజ్‌ఖాన్‌గా నటించ‌డం త‌న డ్రీమ్ అని క్లారిటీ ఇచ్చారు. కాలం కిందట చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా నటించడం తన జీవితాశయం అని చెప్పాడు, దానికి తగ్గట్టుగానే ఇటీవల చిరంజీవి  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి చిత్రానికి చేసిన సంగతి తెలిసిందే,  తాజాగా ఒంగోలులో జరిగిన వీర‌సింహారెడ్డి  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి బాలయ్య ఈ చెంఘీజ్‌ఖాన్ గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చెంఘీజ్‌ ఖాన్ కచ్చితంగా చేస్తా... అది నా జీవితాశయం... కానీ టైం రావాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇక ఇదే వేడుకలో ఆయన అనిల్ రావిపూడి కూడా మంగోలియన్  అన్నాడు. ఒంగోలియ‌న్... మంగోలియ‌న్ అంటూ అందులో అనిల్ రావిపూడి పేరును తీసుకు వ‌చ్చాడు.  బహుశా అనిల్ రావిపూడి తో బాలయ్య చిత్రం చెంఘీజ్ ఖాన్  అయి ఉంటుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ అనిల్ రావిపూడి నుంచి మ‌నం పటాస్, ఎఫ్ 2 వంటి చిత్రాలను ఆశించవచ్చు.  చెంఘీజ్‌ఖాన్ వంటి ఓ చారిత్రాత్మక కథను అనిల్ రావిపూడి హ్యాండిల్ చేయగలడా? అనేది అనుమానమే. ఇక  ఇదే వేదికపై బాలయ్యతో నాలుగు  బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన సీనియర్ దర్శకుడు బి. గోపాల్ కూడా ఉన్నారు. ఆయన ఎప్పటినుంచో బాలయ్య తో ఓ చిత్రం చేయాలనుకుంటున్నాడు. మరి బాలయ్య ఏమైనా  బి.గోపాల్ కు చెంఘీజ్ ఖాన్ బాధ్య‌త‌లు  అప్పగిస్తాడా? అనే అనుమానం వస్తుంది. కానీ బాల‌య్య బి.గోపాల్తో చిత్రం చేయ‌డం ఖాయ‌మ‌ని కానీ అది ఫ్యాక్ష‌న్ మూవీనే అవుతుంద‌ని అంటున్నారు.  చాలామంది మాత్రం చెంఘీజ్ ఖాన్ వంటి స్టోరీకి  రాజమౌళి, క్రిష్ వంటి వారు మాత్రమే త‌గిన న్యాయం చేయ‌గ‌ల‌ర‌ని  సూచిస్తున్నారు. కానీ ఒక‌సారి ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి మాట్లాడుతూ యంగ్ స్టార్స్‌తోనే చిత్రాలు చేస్తాను గానీ సీనియ‌ర్ స్టార్ల జోలికి పోను. ఎందుకంటే సీనియ‌ర్ స్టార్ల‌కు నాకు స‌రిగా బాండింగ్ కుద‌ర‌దు అని ఓపెన్‌గా చెప్పారు. 

ఇక మిగిలింది క్రిష్‌. ఈయ‌న ఆల్రెడీ బాల‌య్య‌తో అతి త‌క్కువ  స‌మ‌యంలో లిమిటెడ్ బ‌డ్జెట్‌లోనే త‌న‌కున్న ప‌రిధుల‌ను దృష్టిలో ఉంచుకుని వాటికి అనుగుణంగా గౌత‌మీ పుత్ర‌శాత‌క‌ర్ణి తీసి మెప్పించారు. ఇక  బాలయ్య నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారా అనే సోషియో  ఫాంటసీ చిత్రాన్ని  తీసి ఏకంగా కళ్యాణ్ రామ్‌కి కెరీర్ లోనే అతిపెద్ద హిట్టు  ఇచ్చిన దర్శకుడు వశిష్ట్ కు ఈ అవకాశం వస్తుందని మరికొందరు భావిస్తున్నారు. ఎందుకంటే తాజాగా బాలయ్య వశిష్ట తో కూడా ఓ చిత్రాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక బాల‌య్య చెంఘీజ్ ఖాన్ చిత్రాన్ని చేస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టి నుంచి ప‌లువురుఈ చెంఘీజ్ ఖాన్ గురించి తెలుసుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. అసలు ఎవరీ చెంఘీజ్ ఖాన్  అనే అనుమానాలు వస్తున్నాయి. చాలా మందికి ఈ చెంఘీజ్ ఖాన్  గురించి తెలియదు.  ప్రపంచంలోనే అతి పెద్దదైన మంగోలియన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చెంఘీజ్ ఖాన్. ఆయన ఎన్నో సంచార జాతులను ఒకటిగా చేసి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చిన్న చిన్న రాజులను తన సామంతులుగా చేసుకొని తన మంగోలియన్ సామ్రాజ్యంలో కలిపి వేసుకున్నాడు. తన  సామ్రాజ్య విస్తరణకు ఎన్నో యుద్ధాలు చేశాడు. 

ఆయన జీవితమంతా యుద్ధాలు,  పోరాటాలతోనే సాగింది. ఈయన అసలు పేరు టెమూజిన్‌.  చారిత్రక కార్ల సమాచారం ప్రకారం ఏదైనా  సామ్రాజ్యంపైచెంఘీజ్‌ ఖాన్ సేన దండయాత్ర చేస్తే వారు అక్కడి ప్రజలను నానా హింసలకు గురి చేసేవారు. స్త్రీలను హింసించేవారు. వారిపై ఎంతో క్రూరత్వం చూపించేవారు. మహిళలను  ఎత్తుకొని వెళ్లేవారు. అతను, అతని సైన్యం చేసే  అఘాయిత్యాలు, క్రూరత్వం  భరించలేక ఎంతోమంది రాజులు తమ సామ్రాజ్యాన్ని మంగోలియన్ సామ్రాజ్యంలో కలిపి వేసి ఆయనకు సామంతులుగా మారారు. ఇన్ని చేసినా కూడా మంగోలియాలకు ఆయ‌న దైవంతో సమానం. యుద్ధ తంత్ర నీతిలో ఆయనను మించినవాడు లేడు.వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నడంలో, యుద్ధ రీతిని అనుసరించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ విషయంలో ఆయనను మించిన ధీరుడు లేడని మంగోలియన్లు భావిస్తారు. ఎంత బలవంతులైన వారికి... ఎంత పెద్ద సైన్యం ఉన్నప్పటికీ తనదైన వ్యూహరచనతో ఆయన వారిని కకావికలు చేసేవాడు. వాస్తవానికి ఛంఘీజ్ ఖాన్ లో  హీరో కంటే విల‌న్ ఛాయ‌లే ఎక్కువగా క‌నిపిస్తాయి.   ఆయన చేసిన  పనులు చూస్తే ఎక్కువమంది దృష్టిలో ఆయన ఒక విలన్. మరి బాలయ్య చెంఘీజ్‌ఖాన్గా  నటిస్తే అతడిని విలన్ ఛాయల్లో చూపిస్తారా?లేక హీరోగా ఎలివేట్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. హిట్ల‌ర్ని గొప్ప నాయ‌కుడిగా భావించేవారు కూడా ఉన్నారు. కొంత మంది దృష్టిలో హిట్ల‌ర్‌, గాంధీని చంపిన గాడ్సే, స‌ద్దాం హుస్సేన్‌, అడీ అమీనులు కూడా ఆరాధ్య దైవాలే.. మ‌రి ఈ విషయంలో బాల‌య్య ఆలోచ‌న ఏ విధంగా ఉందో వేచిచూడాల్సి వుంది....!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.