![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ధమాకా' వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రవితేజ కెరీర్ లో వంద కోట్ల క్లబ్ లో చేరిన తొలి సినిమా 'ధమాకా' కావడం విశేషం.
రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ధమాకా'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదలైంది. మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మూవీ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. విడుదలైన రెండు వారాల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిందని తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. రవితేజ కెరీర్ లో మొదటి వంద కోట్ల సినిమా కావడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

ఇదిలా ఉంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన 'కార్తికేయ-2' సైతం 2022 ఆగస్టులో విడుదలై వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు 'ధమాకా'తో కూడా మరోసారి మేకర్స్ ఆ ఫీట్ సాధించడం విశేషం.
![]() |
![]() |