Home  »  News  »  మిల్కీ బ్యూటీ మెరుపులు ఇంకొంత కాలమేనా?!

Updated : Jan 6, 2023

టాలీవుడ్ కి ఆనాడు ఉవ్వెత్తున దూసుకొచ్చి యూత్ లో క్రేజీగా వెలిగిపోయిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. మంచు మనోజ్ తో ప్రారంభించి పెద్దపెద్ద యంగ్ స్టార్స్‌,  సీనియర్ స్టార్ హీరోల సరసన కూడా నటించింది. మంచు మనోజ్ నుంచి చిరంజీవి వరకు అందర్నీ తన డాన్సులతో అందచందాలతో మెప్పించింది. చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలతో పనిచేసి తనదైన మార్క్ వేసింది. ఐటెం పాటలో సైతం మెప్పించింది. దాదాపు 13 ఏళ్లుగా ప్రేక్షకుల్ని మెప్పిస్తూ  తెలుగులో గ్లామర్ హీరోయిన్ గా కెరియర్ కొనసాగించడం అంటే నేటి రోజుల్లో చిన్న విషయం కాదు.

ఆ విధంగా చూసుకుంటే తమన్నా భాటియా తెలుగులో తనదైన ముద్రవేసింది. తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. అయితే గత నాలుగైదేళ్లుగా ఈ  అమ్మడికి సరైన అవకాశాలు రావడం లేదు. హీరోయిన్‌గా ఛాన్స్ తగ్గడంతో సహాయ పాత్రలు, గెస్ట్ పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు ఈ రకమైన అవకాశాలు కూడా తగ్గాయి. ఇటీవలే గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటించింది. అందులో సత్యదేవ్ హీరో. స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన భామ సత్యదేవ్‌ లాంటి సహాయ నటుడి స‌ర‌స‌న‌ నటించడంతో మిల్కీ బ్యూటీ ఎంతగా నెమ్మదించిందనేది అర్ధ‌మ‌వుతుంది. 

ప్రస్తుతం తెలుగులో బోళా శంకర్ సినిమాలో చిరుకి జోడిగా నటిస్తోంది. చిరుకి హీరోయిన్ల సమస్య ఎప్పుడు ఉండేదే. ఈ మధ్యకాలంలో అది ఎక్కువైంది.  సైరా నరసింహారెడ్డిలో చిరుతో కొన్ని సన్నివేశాలకు తమన్నా న్యాయం చేయడంతో బోళా శంకర్ లో ఛాన్స్ దక్కించుకోగలిగింది. ఈ సినిమా తప్ప తెలుగులో ఆమెకు మరో ప్రాజెక్ట్ చేతిలో లేదు. ఈ సినిమా హిట్ అయినా మళ్లీ బిజీ అవుతుందన్న నమ్మకం లేదు. ఇలాంటి సమయంలో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా తమన్నా భాటియా న్యూ ఇయర్ పార్టీలో రెచ్చిపోయింది. గోవాలో జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న ఆమె తన ప్రియుడు విజయవర్మతో కలిసి ఎంజాయ్ చేస్తూ తెగ హల్చల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న వీరి వ్యవహారం ఇప్పుడు లీక్ అవడంతో ఇక అధికారికంగా వారు ఏమైనా ప్రకటిస్తారా? అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ వీడియో చూసిన కొందరు క్రేజీ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈమె ప్రియుడు విజయ వర్మ 2012లో చిట్టా గ్యాంగ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు.  ఇతడు మన నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసీఏ చిత్రంలో విలన్ కూడా  నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యారు.  నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించిన ఓ వెబ్ సిరీస్ కోసం తమన్నా- విజయవర్మ ఇద్దరూ కలిసి పనిచేశారు. అక్కడే వారికి పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది అని  మీడియా చెప్తోంది. కాగా విజయవర్మ తెలంగాణ అబ్బాయి.  దాంతో తమన్నా తెలంగాణ కోడలు కానుంది అనే  వ్యాఖ్యలు విపరీతంగా వినిపిస్తున్నాయి. మరి వీరి రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందా లేక మూణ్ణాల  ముచ్చటవుతుందా అనేది వేచి చూడాలి...!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.