![]() |
![]() |

సన్నీలియోన్ నటించిన సినిమా ఓ మై ఘోస్ట్. ఈ చిత్రాన్ని కేరళ, కర్ణాటకలో శుక్రవారం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు సన్నీలియోన్. ``కేరళ, కర్ణాటకలో ఓ మై ఘోస్ట్ జనవరి 6న విడుదల కానుంది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది`` అని ప్రకటించారు సన్నీలియోన్. సన్నీ అలా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారో లేదో, నెటిజన్లు ఇలా కామెంట్ల బాక్సును నింపేశారు. లవ్ యూ సన్నీ అని కొందరు అంటే, నీ వండర్‌ఫుల్ టాప్ క్లాస్ యాక్టింగ్‌తో ఎలాంటి రోల్‌లో అయినా ఈజీగా ఫిట్ అవుతావు అని మరికొందరు అన్నారు.
ఆర్.యువన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో ఉంటుంది. అడల్ట్ ఫిల్మ్ మేకర్, అతని గర్ల్ ఫ్రెండ్ కలిసి ఓ బంగళాకి వెళ్తారు. అతనికో పాస్ట్ ఉందని, అతన్ని ఓ ఘోస్ట్ తరుముతోందని, ఆమె పవర్‌ఫుల్ క్వీన్ అని గర్ల్ ఫ్రెండ్‌కి తెలియదు. ఇందులో క్వీన్ మాయసేనాగా నటించారు సన్నీలియోన్. కొన్ని శతాబ్దాల క్రితం జీవించిన ఆమె చరిత్ర ఏంటి అనేది ఆసక్తికరం. సతీష్, యోగిబాబు, దర్శ గుప్త, మొట్టై రాజేంద్రన్, రవి మారియా, రమేష్ తిలక్, అర్జునన్, తంగదురై కీలక పాత్రల్లో నటించారు.
టీవీ యాక్టర్ అర్జున్ బిజ్‌లానీతో కలిసి స్పిల్ట్స్ విల్లా అనే కార్యక్రమానికి హోస్ట్ చేస్తున్నారు సన్నీలియోన్. 2012లో ఎరోటిక్ థ్రిల్లర్ జిస్మ్ 2తో బాలీవుడ్‌లో యాక్టింగ్ డెబ్యూ చేశారు సన్నీలియోన్. జాక్‌పాట్, రాగిణి ఎంఎంఎస్2, ఏక్ పహేలీ లీలా, తేరా ఇంతిజార్‌తో పాటు పలు సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా సన్నీలియోన్ సుపరిచితమే. కొన్ని స్పెషల్ సాంగ్స్ చేశారు. కరెంట్ తీగలో నటించారు. రీసెంట్‌గా మంచు విష్ణు జిన్నాలోనూ నటించారు. జంబలకిడి జారు మిఠాయా పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సన్నీలియోన్‌కి కేరళలో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది.
![]() |
![]() |