![]() |
![]() |

తెలుగులో సీక్వెల్ హవా ప్రారంభమైంది. 'రక్త చరిత్ర 1', 'రక్త చరిత్ర 2' లాగానే ఆ తర్వాత 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' వచ్చాయి, తరువాత 'బాహుబలి' పార్ట్ 1, పార్ట్ 2 వచ్చాయి. 'ఆర్ఆర్ఆర్' కూడా సీక్వెల్ రూపంలో రానుంది. విశ్వరూపం, కేజీఎఫ్, కాంతారా, పొన్నియన్ సెల్వన్, ఇండియన్ చిత్రాలకు కూడా సీక్వెల్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రాజమౌళి- మహేష్ కాంబినేషన్‌లో వచ్చే చిత్రం కూడా అవతార్, అవెంజర్స్, బ్యాట్ మాన్, బ్లాక్ పాంథర్ల మాదిరిగా ఒక అద్భుతమైన ఫ్రాంచైజీ చేయాలని నిర్ణయించారు.
ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి జక్కన్న ప్లానింగ్ అలానే సాగుతోంది. మహేష్- రాజమౌళి మూవీ ప్రణాళికలు మైండ్ బ్లాక్ అయ్యేలా, షాక్ ఇచ్చే విధంగా లీకులు అందుతున్నాయి. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కొన్ని లీకులందించారు. మహేష్ తో రాజమౌళి చిత్రానికి మరిన్నిసీక్వెల్స్ ఉంటాయని, అలా ఓ ఫ్రాంచైజీగా ఈ మూవీ సీక్వెల్స్ తెరకెక్కుతాయని ఆయన వెల్లడించారు. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని... ఇది నేటి ట్రెండ్ కి అనుగుణంగా ఫ్రాంచైజీగా రూపాంతరం చెందుతుందని ఆయన వెల్లడించారు.
అయితే సీక్వెల్లో కథలు మారుతాయి కానీ ప్రధాన పాత్రలు మారవని దర్శకధీరుని తండ్రి అన్నారు. మొదటి భాగానికి సంబంధించిన స్క్రిప్టును ఖరారు చేసే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ "మహేష్ చాలా ఇంటెన్స్ యాక్టర్. అలాంటి హీరోతో రాజమౌళి చాలా కాలంగా ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా చేయాలని అనుకుంటున్నారు" అని తెలియజేశారు. తమ ఆలోచనలకు అనుగుణంగా మహేష్ బాబు తమ చిత్రానికి బెస్ట్ చాయిస్‌గా చెప్పుకొచ్చారు. మహేష్ బాడీ లాంగ్వేజ్, ఫిట్నెస్ విషయంలో, లుక్ విషయంలో చాలా మార్పులు చూస్తారని తెలిపారు. వచ్చే వేసవిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.
ప్రపంచ దేశాల్లో అరుదైన అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాలు చిత్రీకరించేందుకు లొకేషన్ వేట సాగిస్తున్నారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ కి మహేష్ బాబు సరిగ్గా సూట్ అవుతారని విజయేంద్ర ప్రసాద్ అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్, తారక్, చరణ్‌లతో సినిమాలు తీసిన దర్శకదీరుడు రాజమౌళి మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకున్నారు. మహేష్ నటించే ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఉండాలని ఆయన భావించారు. వెంటనే తన ఆలోచన విజయేంద్రప్రసాద్ తో కూడా పంచుకున్నారు. మహేష్ ఎంపిక పూర్తయింది. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథాంశాన్ని తీర్చిదిద్దుతున్నామని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
![]() |
![]() |