Home  »  News  »  వీర సింహారెడ్డి డైలాగు పై స్పందించిన బుర్ర!

Updated : Jan 3, 2023

అతి తక్కువ చిత్రాలతోనే రచయితగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రైటర్ సాయి మాధవ్ బుర్ర. ఈయన చాలా బాగా సంభాషణలు అందిస్తార‌ని, కథను, పాత్రను, సన్నివేశాన్ని, హీరోల ఇమేజిని, ఎమోషన్స్ ని అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ సంద‌ర్బోచిత డైలాగ్స్  అందిస్తాడని మంచి పేరును తెచ్చుకున్నారు. క్రిష్‌  దర్శకత్వంలో వ‌చ్చిన  కృష్ణం వందే జగద్గురుం చిత్రంతో కెరీర్‌ని ప్రారంభించిన  ఆయన పవన్ కళ్యాణ్ =వెంకటేష్ నటించిన గోపాల గోపాల, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, దొంగాట,కంచె,  రాజు గారి గది, గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, సైరా నరసింహారెడ్డి, క్రాక్, గమనం,ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు తనదైన సంభాషణ‌ల‌ను  అందించి  ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు, గుణశేఖర్ దర్శకత్వంలో సమంతా న‌టిస్తున్న  శాకుంతలం చిత్రాలకు ప‌నిచేస్తున్నారు.  ఇక సాయి మాధవ్ బుర్ర ప్రస్తుతం 2017 లాగే 2023లో కష్టపడుతున్నారు.  ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2017లో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి రెండు చిత్రాలు అటు ఇటుగా విడుదలయ్యాయి. సంక్రాంతికి పోటీ పడ్డాయి. ఈ రెండు చిత్రాలకు సాయి మాధవ్ బుర్రా సంభాష‌ణ‌లు  అందించారు.  

ఇక ఈ ఏడాది ఆయన సంక్రాంతి విడుదలకు సిద్దంగా  ఉన్న నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి కి సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇంతకుముందు గోపీచంద్ మల్లినేని రవితేజ తో తీసిన క్రాక్ సినిమాకు ఈయన పనిచేశారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలకు సంభాషణలు అందించారు. అలా చూసుకుంటే వీరసింహారెడ్డి చిత్రం బుర్ర రాస్తున్న బాలయ్య నాలుగో చిత్రం. ఇక విషయానికొస్తే నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్ పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉండడం కామన్. నందమూరి ఫ్యాన్స్‌ని దృష్టిలో ఉంచుకుని ఎంతో  ఆలోచించే ఈ డైలాగ్స్ ను ప్రత్యేకంగా రాయించుకుంటారు. అలాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ బాలయ్య మాత్రమే చెబితే బాగుంటుందని అనిపిస్తుంది. ఇదివరకు డైమండ్ ర‌త్న‌బాబు  బాలకృష్ణకు డైలాగులు  రాస్తుంటే లేటెస్ట్ గా సాయిమాధ‌వ్‌ బుర్ర బాలయ్యకి మంచి డైలాగులు ఇస్తున్నారు. అయితే సాయి మాధవ్ బుర్ర కేవలం పంచుల కోసమే పంచులు రాయకుండా సన్నివేశానికి, ఎమోషన్స్ కి తగ్గట్టుగా పవర్‌ఫుల్ డైలాగ్స్ రాస్తాడని చెప్పాలి. ఈయన రాసే డైలాగ్స్ ఎంతో సందర్భోచితంగా ఉంటాయి. ఇక వీర‌సింహారెడ్డి  సినిమా టీజర్ లోనే బోసిడికే అనే డైలాగ్ రాశారు సాయి మాధ‌వ్‌ బుర్ర. 

బాలకృష్ణ సినిమాల్లోని డైలాగ్ అంతా అవతల వారికి వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఉంటాయి. ప్రత్యక్షంగా రాజకీయాల్లో కూడా ఉండడంవల్ల అవతల వారిని దృష్టిలో పెట్టుకొని అన్నట్టే ఉంటుంది. అయితే ఈ బోసిడికే డైలాగ్ కేవలం బాలయ్య పాత్రను దృష్టిలో పెట్టుకుని ఆ డైలాగు రాశానే  తప్ప ఎవర్‌నో ఉద్దేశించి కాదు....అంటున్నారు బుర్ర‌.  టీజర్ వ‌చ్చిన  టైంలో ఏపీలో అధికార పార్టీ నేతలు వైసీపీ వారు  బాలకృష్ణ డైలాగు మీద అసంతృప్తి వ్య‌క్తం చేశారు.  అదంతా పొలిటికల్ స్టంట్ కాగా వీరసింహారెడ్డి సినిమాలో ఆ డైలాగ్ తను కావాలని రాసింది కాదని, సినిమాలో హీరో పాత్ర ఆ డైలాగ్ చెప్తే బాగుంటుందని మాత్రమే రాశానని అంటున్నారు. సినిమా విశేషాల గురించి చెప్తూ నందమూరి ఫ్యాన్స్ కి వీరసింహారెడ్డి ఐ ఫీస్ట్  అందిస్తుందన్నారు. నందమూరి ఫ్యాన్స్ కి ఈ సంక్రాంతి డబుల్ ధమాకా పక్కా అని చెప్పుకొచ్చారు. ఇక బోస‌డికే అనే ప‌దానికి వ‌స్తే ఆమ‌ధ్య ఈ ప‌దం పెద్ద సంచ‌ల‌నం సృష్టించింది.

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు ప‌ట్టాభి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌తో ఏపీ రాజ‌కీయాలు నాడు విప‌రీతంగా వేడెక్కాయి. అది ప‌క్కా బూతు అని వైసీపీ వారు ఆరోపించారు. కానీ ఇది నిత్యం కోపం వ‌చ్చిన‌ప్పుడు ఇత‌రుల‌పై వాడే ఒక మామూలు ప‌ద‌మేన‌ని, దీని అర్ధం చూసుకున్నా కూడా ఇందులో తిట్టు క‌నిపిస్తుందే గానీ బూతు క‌నిపించ‌ద‌ని తెలుగుదేశం వారు వాదించారు. దాదాపు నెల‌రోజుల పాటు ఈ ప‌దం ట్రెండింగ్‌లో సాగింది. ఈ ప‌దం అర్ధం కోసం నాడు అంద‌రు గూగుల్‌ని ఆశ్ర‌యించారు. అలా ఈ ప‌దం కోసం వెతికిన వారి సంఖ్య అంతా ఇంతా కాదు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.